దేశంలో ప్రస్తుతం కోవిడ్ రెండో వేవ్ నడుస్తోంది. ఈ నెలాఖరు వరకు మూడో వేవ్ వస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే కోవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీకాలను కూడా వేగంగా పంపిణీ చేస్తున్నారు. అయితే టీకా తీసుకోవడంతోనే సరిపోదు, పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే టీకా తీసుకున్న ప్రయోజనం కలుగుతుంది. దీంతో టీకా మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. మరి కోవిడ్ టీకా వేయించుకున్నా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* కోవిడ్ టీకా తీసుకున్న వారు కూరగాయలు, ఆకుకూరలను బాగా తినాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. కోవిడ్ వ్యాప్తి చెందకుండా రక్షిస్తాయి.
* కోవిడ్ టీకా తీసుకున్న వారు రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తిని ఇంకా పెంచుకోవచ్చు.
* రోగ నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. కనుక రోజూ ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి.
* నిమ్మకాయలు, నారింజ, బొప్పాయి వంటి పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు. కోవిడ్ టీకా తీసుకున్న తరువాత కచ్చితంగా ఈ పండ్లను తినాలి. దీంతో ఎక్కువ రక్షణ లభిస్తుంది.
* కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యం అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ టీకా తీసుకున్న వారు కచ్చితంగా రోజూ కొబ్బరినీళ్లను తాగుతుండాలి. దీంతో కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.