Chama Dumpalu : చామ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Chama Dumpalu : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం వివిధ ర‌కాల దుంప‌ల‌ను కూడా కూర‌గాయ‌ల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంప‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా కాలం నుండి మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ చామ దుంప‌ల‌ను త‌ప్ప‌కుండా తినాల‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌రల్స్ తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి.

మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ఈ చామ దుంప‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చామ దుంప‌ల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొవ్వు శాతం త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఈ దుంప‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. చామ దుంప‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎటువంటి గుండె స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

amazing health benefits of Chama Dumpalu
Chama Dumpalu

చామ దుంప‌ల్లో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా ప్రేగుల్లో క‌ద‌లిక‌లు పెరిగి అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, త‌ల‌తిర‌గ‌డాన్ని త‌గ్గించ‌డంలో కూడా చామ దుంప‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. క‌నుక‌ చామ దుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్సర్ ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను కూడా ఈ దుంప‌లు అదుపులో ఉంచుతాయి. వ‌ర్షాకాలంలో మ‌నం వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ చాము దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఈ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన మ‌నం ప‌డ‌కుండా ఉంటాం. క‌నుక ఈ చామ దుంప‌ల‌ను కూర‌గా, వేపుడుగా లేదా పులుసు కూర‌గా చేసుకుని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts