Okra Water : బెండకాయల నీళ్లను పరగడుపునే తాగితే షుగర్‌, అధిక బరువును తగ్గించుకోవచ్చా ? నిజం ఇదే..!

Okra Water : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని తరచూ చాలా మంది కూరల రూపంలో చేసుకుని తింటుంటారు. బెండకాయలతో వేపుడు, పులుసు, టమాటా కూరలను చేసుకుని తింటుంటారు. అయితే బెండకాయలను కట్‌ చేసి వాటిని నీళ్లలో ఉంచి నానబెట్టి తరువాత కొన్ని గంటలకు ఆ నీటిని తాగితే షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. దీంతో అధిక బరువు కూడా తగ్గవచ్చని అంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? దీనిపై సైంటిస్టుల పరిశోధనలు ఏం చెబుతున్నాయి ? అంటే..

drink Okra Water on empty stomach for these benefits

బెండకాయలను నిలువుగా ముక్కలుగా చిన్నగా కట్‌ చేయాలి. అనంతరం వాటిని ఒక గ్లాస్‌ నీటిలో వేయాలి. రాత్రి పూట అలా వేశాక మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. అంతేకాదు.. అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులే చెబుతున్నారు.

బెండకాయల్లో మాంగనీస్‌ అనే మినరల్‌ అధికంగా ఉంటుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అందువల్ల బెండకాయల నీళ్లను తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ఇక ఇదే మాంగనీస్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. దీంతోపాటు విటమిన్‌ సి కూడా బెండకాయల్లో ఉంటుంది కనుక షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. కాబట్టి బెండకాయల నీళ్లను తాగితే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో షుగర్‌, గుండె జబ్బులు, క్యాన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు. అలాగే బెండకాయల్లో ఉండే ఫైబర్‌ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. బెండకాయల నీళ్లను తాగుతుంటే మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్‌, కడుపులో మంట సమస్యలు ఉండవు.

బెండకాయల్లో థయామిన్‌, ఫోలేట్‌, మెగ్నిషియం, విటమిన్‌ బి6, కాపర్‌లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇన్ని విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి కనుక బెండకాయల నీళ్లను తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Admin

Recent Posts