కూర‌గాయ‌లు

అలసందలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి గింజల రూపంలోనూ లభిస్తాయి. వీటిని నవధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. వీటిల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలసందలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of alasandalu

1. అలసందలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

2. హైబీపీ ఉన్నవారు అలసందలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో బీపీ నియత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

3. అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి.

4. అలసందలను తినడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. వీటిల్లో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చూస్తుంది. నాడులకు శక్తిని ఇస్తుంది.

5. అలసందలలో ఉండే ఐరన్‌ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని మెగ్నిషియం మన శక్తి స్థాయిలను పెంచుతుంది.

6. అలసందలను తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్, మినరల్స్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.

7. రోజూ కప్పు ఉడకబెట్టిన అలసంద గింజలను తింటే డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చు. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి.

8. అలసందల వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts