Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం కూర‌గాయ‌లు

Ponnaganti Kura : వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర.. ఇంకా ఎన్నో లాభాలు..!

Admin by Admin
December 29, 2021
in కూర‌గాయ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ponnaganti Kura : ప్రస్తుతం మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పీల్చే గాలిలో కాలుష్య కారకాలు, రసాయనాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో అవి మన రక్తంలోనూ కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో మనం ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of eating Ponnaganti Kura

1. పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆకుకూరను తీసుకోవాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

2. అధిక బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

3. పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. కళ్లను సంరక్షించుకోవచ్చు. కంటి చూపు రెట్టింపవుతుంది. స్పష్టంగా కనిపిస్తుంది.

4. పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారికి ఇదొక బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

5. అధిక బరువు తగ్గాలనుకునేవారికి, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారికి పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

6. పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసుకోవచ్చు. చర్మం, ఎముకలు తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

7. వీర్యం ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయినా అందులో లోపం ఉంటే పురుషులకు సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే పొన్నగంటి కూరను రోజూ తింటుంటే.. వీర్య కణాల్లో ఉండే లోపం తగ్గుతుంది. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. దీంతోపాటు వీర్యం ఎక్కువగా తయారవుతుంది. దీని వల్ల పురుషులకు సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. కనుక పురుషులు రోజూ పొన్నగంటి కూరను తినాలి.

8. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు ఈ కూరను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags: Ponnaganti Kuraపొన్నగంటి కూర
Previous Post

Idli : మీరు రోజూ తినే ఇడ్లీల్లో దీన్ని క‌లిపి తినండి.. వేగంగా బ‌రువు త‌గ్గుతారు..!

Next Post

Raw Banana : ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో ఇలా చేస్తే.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీకుండే ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..

May 31, 2025
vastu

మీ ఇంట్లో ఈ పెయింటింగ్‌ల‌ను పెట్టండి చాలు.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి..!

May 31, 2025
vastu

మీ ఇంట్లో చిన్న‌పాటి పిర‌మిడ్‌ను ఇలా పెట్టండి.. జ‌రిగే మార్పును మీరే చూస్తారు..

May 31, 2025
వినోదం

ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్

May 31, 2025
వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

May 31, 2025
information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!