Kothimeera Juice: కొత్తిమీర మన ఇంటి సామగ్రిలో ఒకటి. దీన్ని నిత్యం అనేక వంటకాల్లో వేస్తుంటారు. వంటల చివర్లో అలంకరణగా కొత్తిమీరను వేస్తారు. కానీ నిజానికి కొత్తిమీరలో పోషకాలు, ఔషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీరను జ్యూస్ చేసి రోజూ పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
* కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపునే తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
* కొత్తిమీరలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది.
* కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
* కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల గుండె పోటు, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
* ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అయ్యే వారు రోజూ ఒక కప్పు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది.
* కొత్తిమీరలో ఐరన్, విటమిన్ ఇలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. చర్మం, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.