Onions : ఉల్లిపాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. త‌ప్ప‌క ఉప‌యోగించాల్సిందే..!

Onions : ఉల్లిపాయ‌.. వంటింట్లో ఉండే ముఖ్య‌మైన వ‌స్తువుల్లో ఉల్లిపాయ ఒక‌టి. వంట‌ల్లో ఉల్లిపాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ వెనుక ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఉల్లిపాయ‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఉల్లిపాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. ఉల్లిపాయ‌ను ఫ‌స్ట్ ఎయిడ్ బాక్స్ గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని కూడా వారు చెబుతున్నారు. ఉల్లిపాయ వ‌ల్ల క‌లిగే ఐదు ముఖ్య‌మైన ప్ర‌యోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కోసారి చెవులు మూసుకుపోయిన‌ట్టుగా అయిపోతుంది. ఎదుటి వారు చెప్పే మాటలు కూడా ఆ స‌మయంలో స‌రిగ్గా విన‌బ‌డ‌క ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. వినికిడి శ‌క్తిని కోల్పోతాము. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించి ఇటువంటి స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. దీనికోసం ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌రువాత ఒక ముక్క‌ను తీసుకుని చెవి రంధ్రానికి ముందుభాగంలో ఉంచాలి. దీనిని ఎట్టి ప‌రిప్థితుల్లోనూ లోనికి వెళ్ల‌కుండా చూసుకోవాలి. చెవిలో ఈ ఉల్లిపాయ ముక్క‌ను రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజూ ఉల్లిపాయ ముక్క‌ను తీసేసి చెవిని శుభ్రం చేయాలి.

we must use onions daily for there benefits know them
Onions

ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య తగ్గి వినికిడి సుల‌భ‌త‌రం అవుతుంది. అలాగే కాలిన గాయాల‌ను కూడా ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. కాలిన గాయాల‌కు ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. ఉల్లిపాయ‌ను అడ్డంగా ముక్క‌లుగా కోసి కాలిన గాయాల‌పై రాయాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను గాయాల‌పై 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాలిన గాయాల వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. అదే విధంగా తేనెటీగ‌, కందిరీగ కుట్టిన గాయాల నుండి కూడా ఉల్లిపాయ మ‌న‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది.

తేనెటీగ కుట్టిన చోట చాలా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి బొబ్బ‌లు ఏర్ప‌డి ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టుకుపోయి గ‌డ్డలుగా మారే అవ‌కాశం కూడా ఉంది. క‌నుక తేనెటీగ కుట్టిన వెంట‌నే అది కుట్టిన చోట ఉల్లిపాయ‌ను రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నొప్పి నుండి వెంట‌నే ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరం వెంట‌నే చ‌ల్ల‌బ‌డుతుంది. శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఉల్లిపాయ‌ను గుండ్రంగా కోసి అరి కాళ్ల ద‌గ్గ‌ర ఉంచి దానిపై నుండి సాక్స్ ను ధ‌రించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ప‌చ్చిఉల్లిపాయ‌లు మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాలను తొల‌గిస్తాయి. కాబ‌ట్టి ప్ర‌తిరోజూ మ‌నం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ‌లు ఉండేలా చూసుకోవాలి. ఉల్లిపాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఇటువంటి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts