Ridge Gourd : బీర‌కాయను వీరు అస‌లు తినకూడ‌దు.. ఎందుకో తెలుసుకోండి..!

Ridge Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి అంటే చాలా మందికి న‌చ్చవు. కానీ బీర‌కాయ‌లు మ‌న‌కు అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. అయితే కొంద‌రు మాత్రం వీటిని అస‌లు తిన‌కూడ‌దు. తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. ఇక బీర‌కాయ‌ల‌ను అస‌లు ఎవ‌రు తినాలి, ఎవ‌రు తిన‌కూడ‌దు, ఎందుకు తిన‌కూడ‌దు.. వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బీర‌కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్ ఉంటాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల బీర‌కాయ మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది.

బీర‌కాయ‌ల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. క‌నుక ఇది కంటి చూపును పెంచుతుంది. అయితే అలర్జీ స‌మ‌స్య‌లు ఉ్న‌వారు బీర‌కాయ‌ల‌ను తిన‌కూడ‌దు. తింటే చ‌ర్మంపై దుర‌ద‌, ద‌ద్దుర్లు వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి వీరు బీర‌కాయ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మేలు. అలాగే నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం గ‌ర్భిణీలు బీర‌కాయ‌ల‌కు దూరంగా ఉండాలి. ఆ స‌మ‌యంలో వీటిని వారు తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదురు కావ‌ల్సి రావ‌చ్చు.

who should not eat Ridge Gourd must know the facts
Ridge Gourd

విరేచ‌నాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు లేదా వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బీర‌కాయ‌ల‌ను తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. ఇలా కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు బీర‌కాయ‌ల‌ను అస‌లు తిన‌క‌పోవ‌డమే మంచిది. లేదంటే ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

Share
Editor

Recent Posts