గుండె జబ్బులు అనేవి ప్రస్తుత తరుణంలో సహజం అయిపోయాయి. చిన్న వయస్సులోనే చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్‌లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చినా లేదా ఇతర ఏదైనా గుండె జబ్బు వచ్చినా కోలుకున్న తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాలి.
గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు వచ్చి కోలుకుంటున్న వారు, గుండె బలహీనంగా అయిన వారు రోజూ పరగడుపునే ఒక కప్పు సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. దీంతో గుండె బలంగా మారుతుంది. అలాగే గుమ్మడికాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి విత్తనాలను తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి రోజుకు గుప్పెడు మోతాదులో తినవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వెల్లుల్లిని తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి మింగాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం కోసం రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి.
వారానికి ఒకసారి ఆవ నూనె లేదా నువ్వుల నూనెను వేడి శరీరమంతా మర్దనా చేసుకోవాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీలను తగ్గించాలి. అందుకు బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ లను తాగాలి.
మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. అయితే మద్యం తాగాలనిపిస్తే రెడ్ వైన్ తాగవచ్చు. అది కూడా మోతాదులో తీసుకోవాలి. 2 పెగ్‌లకు మించరాదు. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కనుక రెడ్ వైన్‌ను తాగవచ్చు.
చేపలు, ఆలివ్ నూనె, వాల్ నట్స్, బాదంపప్పులలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం మంచిది.
చిలగడదుంపలు, నారింజ పండ్లు, బార్లీ, ఓట్స్, చెర్రీలను తినవచ్చు. పాలు, పెరుగు తీసుకుంటే కొవ్వు లేనివి తీసుకోవాలి. ఇలా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> తక్షణ శక్తిని అందించే సగ్గు బియ్యం.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ?
ఇది కూడా చదవండి ==> కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయా ? దానిమ్మ పండు జ్యూస్‌ను ఇలా తాగండి.. సమస్య తగ్గుతుంది..!
ఇది కూడా చదవండి ==> లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?
ఇది కూడా చదవండి ==> అన్నం తింటూ కూడా బరువు తగ్గవచ్చా ? అది సాధ్యమవుతుందా ?