ప్రభాకరం 35 సంవత్సరాలు జడ్జి గా పని చేసి 10 వేల కేసులకు పైగా తీర్పు చెప్పాడు, రిటైర్ అయిన 15 ఏళ్లకు, సహజ మరణం పొంది, యమ లోకం లో అడుగుపెట్టాడు. ప్రభాభకరం,యమలోకానికి చేరటంతో మొదటిసారి బోనులో నిల్చున్నాడు. తీర్పు చెప్పే యమధర్మరాజు,జడ్జి సీట్లో కూర్చున్నాడు. చిత్రగుప్తుడు ప్రభాకరం పాపాల చిట్టా తెరచి చదవడం మొదలుపెట్టాడు. 10 కేసులు తప్పు తీర్పు చెప్పి, నిర్దోషులను జైలు పాలు చేసాడు ప్రభు అన్నాడు. యామధర్మరాజు – పాపి, 10 మంది నిర్దోషులకు అన్యాయం చేసినందుకు 100 సంవత్సరాలు చీకటి గుహలో బంధించండి అని తీర్పు చెప్పాడు. ప్రభాకరం వెంటనే, సాక్ష్యాలను బట్టి తీర్పు ఇస్తానే తప్పా, కావాలని నేనేమి వాళ్ళని శిక్షించలేదు. అయినా 10 వేల కేసుల్లో 10 కూడా తప్పు అవకుండా ఎలా ఉంటాయి.
అయినా ఆ మాటకు వస్తే, మీరు వేల సంవత్సరాలలో ఎన్ని తప్పు తీర్పులు చెప్పి వుంటారు. మీకు శిక్ష వేసే వారు లేక మీ తప్పులు బయటపడలేదు తప్పా, తప్పులు అందరూ చేస్తారు, అన్ని వ్యవస్థలలో అవకతవకలు ఉంటాయి అన్నాడు అసహనంగా. యామధర్మరాజు – పాపి, మా తీర్పు నే అవహేళన చేస్తావా, ఎంత ధైర్యం అంటూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ప్రభాకరం అప్పటికప్పుడు ఒక అద్భుతమైన ప్లాన్ ని మనుసులోనే ఊహించి, నేను నా జడ్జి వృత్తి కి న్యాయం చేశాను, మీరు మీ జడ్జి వృత్తి కి న్యాయం చేశారని నిరూపించి, నాకు శిక్ష వేయండి. భూలోకం లో వున్న ఎన్నో విషయాలు మీ సంగ్రహిణి లో లేవు, కేవలం పాపం, పుణ్య కార్యాలు మాత్రమె వున్నాయి. భూలోకం లోని అన్ని విషయాలు మీ సంగ్రహిణి లో సేకరించినపుడే సరైన తీర్పు దొరుకుతుంది. మీ యమ లోకం అప్డేట్ అవ్వాల్సిన అవసరం వుంది. యామలోకం అప్డేట్ అయిన తరువాత, నాకు తీర్పు చెప్పండి, ఎటువంటి శిక్ష అయినా స్వీకరిస్తాను అంటూ యామధర్మరాజు కు ఛాలెంజ్ చేసాడు ప్రభాకరం.
ముల్లోకాలలో ఆసక్తికరమైన వార్తలు లేక నీరసించిపోయిన నారదుడు యామాలోకంలో ప్రెవేశించి, జరుగుతున్న తంతు ను చాటుగా విన్నాడు. నారాయణ, నారాయణ అనుకుంటూ వచ్చి, యామలోకం లో యమ సరదా వార్త దొరికింది. ప్రభాకరం అడుగుతున్నదాంట్లో తప్పేముంది. మీ పద్ధతులు పాతపడ్డాయి, వాటిని సవరించి తీర్పు చెప్పండి అంటున్నాడు. యామధర్మరాజు ఆలోచనలోపడి సభను రేపటికి వాయిదా వేసాడు. చిత్రగుప్తుడు ని పిలిచి, మనం భూలోకానికి వెళ్లి, అక్కడ వున్న అన్నీ విషయాలను మన సంగ్రహిణి లో సేకరించాలి. ఇంకొక పాపి మన యమ లోకం పాతబడ్డ లోకం అని అనకుండా ఉండాలి, ఆ ప్రభాకరానికి తగిన శిక్ష విధించి, అతని పొగరు అణచాలి అనుకోని, పథకం ప్రకారం భూలోకానికి చేరుకొని, భూలోకం లోని అన్ని విషయాలు వారి సంగ్రహిణి లో సేకరించారు. అప్డేట్ అయిన సంగ్రహిణి తో ఒక ముగ్గురిని పరీక్షించిన తర్వాత తనకు తీర్పు చెప్పాలన్న షరతు పై, ముందుగా ఒక వ్యక్తి ని ప్రవేశపెట్టారు.
ఇతను ఇంకా ఒక సంవత్సరం బతకాలి కానీ ముందే వచ్చేసాడు ప్రభు అన్నాడు చిత్రగుప్తుడు,ఇదెలా సాధ్యం సంగ్రహిణి లో సరిగా చూసి చెప్పు అన్నారు యమధర్మరాజు. దీనికి గల కారణం ప్రభాకరానికి ముందే తెలుసు, భారతదేశం లో తమ 10 వ తరగతి సర్టిఫికెట్ పై ఒక సంవత్సరం తక్కువ వేస్తారు. సంగ్రహిణి భూలోకం లోని విషయాలతో అప్డేట్ అవటంతో, అతని మరణం 54సంవత్సరాల 4 నెలల 12 రోజులు, జరగాల్సింది, సర్టిఫికెట్ వయసు ప్రకారం ఒక సంవత్సరం ముందే జరిగింది. వెంటనే ప్రభాకరం అప్డేట్ అయిన యామలోకం లోనే తప్పులు ఉంటే, ఇంక గతంలో ఎన్ని తప్పులు జరిగి ఉంటాయి. అన్నాడు. మరొక వ్యక్తిని ప్రవేశపెట్టండి అన్నారు యామధర్మరాజు, అతను ఒక నటుడు, చాలా సినిమాలలో విలన్ గా నటించాడు, అతని పాపల చిట్టా తెరిచారు, అప్డేట్ అయిన సంగ్రహిణి పరిశీలించి, ఇతను 150 మందిని చంపాడు ప్రభు అని అన్నాడు చిత్రగుప్తుడు.
మన సంగ్రహిణి అప్డేట్ అవటం వల్ల మనకు వీడియో సాక్ష్యం కూడా దొరికింది ప్రభు, తను చంపిన సాక్షాలు కూడా ఈవిగో అని చూపించాడు, ఆ నటుడు, ఇవి నేను విలన్ గా నటించిన సినిమాలు నిజంగా హత్య చేయలేదు అని గోళ్లు మన్నాడు. Hd క్వాలిటీ లో హత్యలు చేసి, నటన అంటావా? వెంటనేప్రభాకరం అప్డేట్ అయిన యామలోకం లోనే తప్పులు ఉంటే, ఇంక గతంలో ఎన్ని తప్పులు జరిగి ఉంటాయి.అన్ని వ్యవస్థలలో తప్పులు జరగటం సహజం అని గ్రహించి నా శిక్షను రద్దు చేయండి అని డిమాడ్ చేయటం తో, 10th క్లాస్ బర్త్ డేట్ వ్యవహారం, సినిమా వ్యవహారం తెలియని యామధర్మరాజు, చేసేది ఏమిలేక ప్రభాకరానికి విధించిన శిక్షను కొట్టివేశారు.అలా తన జడ్జి తెలివితేటలతో, యామలోకంలో జడ్జి ని బోల్తా కొట్టించి శిక్షను తప్పించుకున్నాడు.