మింగగలదు. పెద్దపులిని పట్టుకుని మింగింది. మధ్యప్రదేశ్ లో కొన్నేళ్ల కిందట పెద్ద పులిని పట్టుకుంది. పులి పోరాడింది. రోడ్డు పక్కనే ఈసంఘటన సంభవించడంతో బస్సులు ఆపి ఈ దృశ్యాన్ని ప్రజలు చూచారు. పదిగంటల పోరాటం తర్వాత పులిని కబళించింది.
సాధారణంగా కొండచిలువలు చిన్నపిల్లను, మేకపిల్లలను, దూడలను పట్టుకుని మింగుతాయి. 1961ప్రాతంలో పెంచలకోన దేవాలయానికి జీర్ణోద్ధరణ చేసేసమయంలో 34 అడుగుల కొండచిలువను కూలీలు చంపినట్లు జమీన్ రైతులో పెద్ద వార్తాకథనం వచ్చింది. నెల్లూరు పడమటి పల్లెల్లోకి కొండచిలువ వస్తే ఊరిజనం మోకులుకట్టి ఊరివెలుపలకు ఈడ్చుకుంటూ వెళ్ళి వదలివచ్చేవారట.
మనంవాటి నివాసప్రాంతాలను ఆక్రమించుకొని ఊళ్ళూ, వ్యవసాయభూములుగా చేశాము. వాటికి ఆహారం దొరక్కుండా, ,వన్యప్రాణులను నిర్మూలించాము. వాటి జీవనవిధానం గురించి తెలుసుకుందాం అనే ఆసక్తి కనబరచం. ఇ.పి. గి, కెన్నెత్ యాండర్సన్, జిం కార్బెట్ ఇంకా చాలా మంది వన్యప్రాణులను గురించి, వేటనుగురించి, రాశారు. చదవండి.