vastu

రాత్రి పూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఒత్తిడి అనేది ఉంటుంది. బిర్యానీ ఆకుల్ని కాల్చడం వల్ల కుటుంబంలో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.

అదే విధంగా చాలా మంది కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యల‌కు గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే.. ప్రతి రోజూ సాయంత్రం రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది ఎన్నో వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

what happens if you burn biryani leaves in home at night

రాత్రి కలలో చాలా మందికి పీడ కలలు అనేవి రావడం సహజం. ఈ పీడ కలలు రాకుండా ఉండాలంటే.. మీరు పడుకొనేటప్పుడు ఒక బిర్యానీ ఆకు కాల్చి పడుకోండి. ఇది చెడు కలల నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది.

చెడు కన్ను మీపై పడకుండా ఉండాలంటే.. రాత్రి పూట రెండు బిర్యానీ ఆకులు ఇంటి ముందు కాల్చండి. అదే విధంగా సాయంత్రం పూట ఇంట్లో బిర్యానీ ఆకులు కాల్చితే.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే రాత్రి పూట రెండు బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు అన్నీ పోతాయి.

Admin

Recent Posts