పాత రికార్డ్ బద్దలవ్వాలన్నా…కొత్త రికార్డ్ నెలకొల్పాలన్నా…దాని వెనకు కఠోర శ్రమ ఉంటుంది. కొన్ని సార్లు రికార్డును సృష్టించే క్రమంలో..ప్రాణాలను సైతం కోల్పోయిన వీరులెంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మీకు ఓ పదిమందిని పరిచయం చేస్తాం. వీళ్ళంతా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాలన్న ప్రయత్నంలో మన నుండి దూరమైన సాహసికులు… సాహసమే ఊపిరిగా గడిపిన ధీశాలులు.. 1. శైలేంద్రనాథ్ రాయ్: డేర్ డెవిల్ ఇండియన్ స్టంట్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేంద్ర నాథ్ రాయ్ గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించేందుకు ఒక రేర్ ఫీట్ ను 2013 లో ఎంచుకున్నాడు. డార్జిలింగ్ లోని తీస్టా నది తీరాన, ఒక జిప్ వైర్ కు తన తలకు ఉన్న జుట్టును ముడివేసి, ఇటువైపు నుండి అటువైపుకు .. ఆ జిప్ వైర్ గుండా ప్రయాణం చేసి పాత రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు. కొద్దిదూరం ప్రయాణించగానే శైలేంద్రనాథ్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. గుండెపోటు రావడంతో ఏమి మాట్లాడలేక పోయాడు.. అతన్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది చేరుకునేలోపే శైలేంద్రనాథ్ తుది శ్వాస విడిచాడు. ఈ విషాదం అక్కడున్న ప్రేక్షకులను కలచివేసింది.
2. హారిస్ సులేమాన్: విమానంలో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని 30 రోజులలో చుట్టేయాలని 17 ఏళ్ళ హారిస్ సులేమాన్ 2014 లో నిర్ణయించుకున్నాడు. తన తండ్రితో కలిసి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ రికార్డును చేరుకునే దశలో పాగో నుండి అమెరికాలోని సమోయ ప్రాంతానికి వెళుతుండగా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో హారిస్ తో పాటు అతని తండ్రి మృతి చెందారు. 3. జనక బస్నయకె: శ్రీలంకలోని 24 ఏళ్ళ జనక బస్నయకె బ్రతికుండగానే సమాధి చేయించుకొని కొత్త రికార్డును నెలకొల్పాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం అంతా సిద్ధం చేసుకొని 10 అడుగుల గోతిని తవ్వి, ఒక పెద్ద చెక్క పెట్టెలో పెట్టి మట్టితో కప్పేసి అతన్ని సమాధి చేశారు. ఉదయం 9.30 గంటలకు అతడ్ని సమాధి చేయగా,, ఏడు గంటలు గడిచిన తర్వాత తవ్వకాలు జరుపగా,అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న జనక బస్నాయకేను పరీక్షించగా అప్పటికే మరణించినట్లు తెలిపారు.
4. జుయన్ ఫ్రాన్సిస్కో గుయిలెర్మో: 5 సంవత్సరాలలో 5 ఖండాలను 2,50,000 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం ద్వారా చేరుకోవాలని చిలీ దేశస్థుడైన జుయన్ ఫ్రాన్సిస్కో గుయిలెర్మో నిర్ణయించుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇలా సైకిల్ ప్రయాణం చేస్తున్న జుయన్ ను, ట్రక్ ఢీకొనడం వల్ల రోడ్ ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. త్వరలో తన కల నేరవేతుందనుకుంటుండగా నాఖోన్-రాచసిమ జాతీయ రహదారిలో మృతి చెందాడు. 5. జెస్సిక డబ్రాఫ్: అతి పిన్న వయసులోనే యునైటెడ్ స్టేట్స్ చుట్టేసిన అమ్మాయిగా కొత్త రికార్డును సృష్టించాలనుకుంది ఏడేళ్ళ బుల్లి ఫైలేట్ జెస్సిక విట్నీ డబ్రాఫ్. 1996లో యుఎస్ లో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ మరియు తన నాన్నతో కలిసి ప్రయాణం సాగించింది. ప్రయాణం పూర్తి చేసుకొని ల్యాండ్ అవుతుండగా వాతావరణం సహకరించగా ఫ్లైట్ ఒరిగిపోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.
6. నికోలస్ మెవోలి: అప్పటివరకూ ఉన్న 101 మీటర్ల లోతును బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేయాలనుకున్నాడు అమెరికాకు చెందిన 32 ఏళ్ళ నికోలస్ మెవోలి. 72 మీటర్లు లోతుకు వెళ్ళిన నికోలస్ తాను బాగానే ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఊపిరితిత్తులు నొప్పిగా, బాధ కలిగి నోటి గుండా రక్తం బయటకు రావడంతో కొన్ని గంటలలోపే అతను తుది శ్వాస విడిచాడు. 7. డయానా పారిస్: స్కై డైవర్.. ఆకాశంలో ప్యారచ్యూట్ ల సాయంతో విహరించేవారు. జర్మన్ దేశస్తురాలైన డయానా పారిస్ తన టీం సభ్యులు 222 మంది కలిసి స్కై డైవింగ్ కు సిద్ధమైంది. రెండు వైమానిక నిర్మాణాల ద్వారా ఫామ్ కావాలని వారు భావించారు. అయితే అందులో డయానా ప్యారచ్యుట్ సరిగా పనిచేయక పోవడంతో, ఓపెన్ కాక ఫెయిల్ కావడంతో ఆమె ప్రమాదవ శాత్తు మరణించారు.
8. గుయ్ గర్మన్/డాక్ డీప్: గుయ్ గర్మన్ నే డాక్ డీప్ అని కూడా అంటుంటారు. లోతైన ప్రాంతాలలో ముంగి తేలుతూ (స్కూబా డైవ్) కొత్త రికార్డును నమోదు చేయడానికి సన్నద్ధమైన గర్మన్ 1200 అడుగుల లోతును అధిగమించడానికి బయలుదేరాడు. కొద్ది దూరం ప్రయాణించగానే అతను మళ్ళీ పైకి కనిపించలేదు. కొద్ది సేపటి తర్వాత అతని శవం బయట తేలియాడింది. 9. లోవెల్ బేలెస్: అమెరికాకు చెందిన లోవెల్ బేలెస్ ఎయిర్ రేస్ మరియు స్టంట్ పైలట్ లో ప్రావీన్యుడు. 1931 లో 300MPH స్పీడ్ తో ఎయిర్ రేస్ ను విజయవంతంగా సాధించాడు. అయితే తను ప్రయాణిస్తున్న ప్లేన్ ఆయిల్ క్యాప్ ఊడిపోవడం వలన.. లోవేస్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. బయట నుండి వచ్చే గాలి వల్ల లోవేస్ ప్రయాణిస్తున్న ప్లేన్ కూలిపోయి, అసహజ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
10. జావేద్ పలజ్బియన్: 22 బస్సులు, 209 అడుగుల దూరంలో ఒకదాని తర్వాత ఒకటి నిల్చున్నాయి. మోటార్ సైకిల్ ద్వారా లాంగ్ జంప్ చేస్తూ ఈ రికార్డును చేధించాలి. 13వ బస్సును దాటగానే బ్యాలెన్స్ తప్పి మృతి చెందాడు ఇరాన్ దేశస్థుడైన 44 ఏళ్ళ జావేద్. డేర్ డెవిల్ స్టంట్ మాస్టర్ గా ప్రూవ్ చేసుకున్న జావేద్, ఈ రికార్డు కోసం ప్రయత్నించి అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు.