Off Beat

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే 4 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు , 70 వేల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమేనా..?

రెండు గేదెలను మేపుకుంటూ , పాలు అమ్ముకుంటూ వచ్చినదానితో సంతోషంగా ఒక పల్లెటూరిలో బతుకుతున్న వాడి జీవితం కంటే కాంక్రీట్ జంగిల్ లో బతుకుతూ, సిటీ బస్సో మెట్రోనో పట్టుకుని పొద్దున్న 8 నుండి రాత్రి 8 వరకు పట్నం లో ఉద్యోగం చేసే వాడి బతుకు ఎక్కువ సంతోషం గా ఉంటుందా?

భార్య వండి పెట్టింది సుష్టుగా తిని రాత్రి 9 గంటలకే నులక మంచం మీద గుర్రు పట్టేవాడి నిద్ర కంటే AC రూమ్ లో 10 అంగుళాల ఫోం బెడ్ మీద పడుకుని రాత్రి 2 గంటల వరకు నిద్ర పట్టక అటు ఇటు బెడ్ మీద కదులుతున్నవాడి నిద్ర గొప్పదా ?

is farmer life good compared to software job

మనకున్న దాని మూలంగా సంతోషం కలగదు. మనకున్న దాని మూలంగా మనం ఎలాటి అనుభూతి చెందుతున్నాము అన్నదాన్ని బట్టి సంతోషం ఉంటుంది.

70 వేల సాఫ్ట్ వేర్ జాబ్ అంటే పట్నం లో 20 వేలు ఇంటి అద్దెకి పోతుంది. పిల్లల్ని ఇంగ్లీషు మీడియం లో చదువు చెప్పించాలంటే , ఇరుగు పొరుగు వారితో సమానంగా నిలబడాలంటే చాలా కష్టమే. పల్లెటూరిలో వ్యవసాయదారులకి ఆదాయము తక్కువే , ఖర్చులు తక్కువే. జీవన విధానమే వేరుగా వుంటుంది. మనం ఎంచుకున్న జీవన విధానమే మన ఖర్చులకి , మన సంతోషాలకి కారణ మవుతుంది.

Admin

Recent Posts