Off Beat

ఆ అందమైన ప్రదేశంలో సెటిల్ అవ్వండి..ప్రభుత్వం మీకు 40 లక్షలు ఇస్తుంది..! ఎందుకో తెలుసా..? ఫ్రీ గా ఇల్లు కూడా.!

స్విట్ల‌ర్లాండ్ ఎంత అంద‌మైన ప్ర‌దేశ‌మో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే సుంద‌రమైన దృశ్యాలు, ప్ర‌కృతి మ‌నోహ‌ర‌త‌, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం, స‌ముద్రాలు, బీచ్‌లు, అద్భుత‌మైన కొండ చ‌రియ‌లు.. వాహ్‌.. చెబితేనే వాటి ద‌గ్గ‌ర ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది క‌దా. ఇక అలాంటి ప్ర‌దేశాల్లో నివ‌సిస్తే క‌లిగే ఎంజాయ్‌మెంటే వేరు. అయితే నిజంగా మీకు అక్క‌డ పర్మినెంట్‌గా నివ‌సించే అవ‌కాశం ద‌క్కితే మీరేం చేస్తారు..? ఇంకేం చేస్తారు.. అలాంటి అవ‌కాశాన్ని ఎవ‌రైనా కాద‌నుకుంటారా..? ఎంచ‌క్కా అక్క‌డికి షిఫ్ట్ అవుతారు. అయితే మీ లాంటి వారి కోస‌మే స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ది. దాన్ని వింటే నిజంగా మీరు ఎగిరి గంతేస్తారు తెలుసా..!

స్విట్ల‌ర్లాండ్‌లోని అల్బినెన్ అనే టౌన్‌లో మీరు ప‌ర్మినెంట్ గా నివాసం ఉండ‌వ‌చ్చు. అవును, మీరు విన్నది నిజ‌మే. జోక్ కాదు. అయితే అందుకు ఏమైనా డ‌బ్బులు చెల్లించాలా ? అంటే.. లేదు. ఫ్రీగానే ఉండ‌వ‌చ్చు. అలా ఉంటే మీకు స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం ఆ టౌన్ లో ఒక ఇల్లు, కొంత స్థ‌లంతోపాటు 60వేల డాలర్ల‌ను (దాదాపు రూ.40 ల‌క్ష‌ల‌ను) రివార్డ్‌గా కూడా ఇస్తుంది. కానీ.. మీరు అక్క‌డ ప‌ర్మినెంట్‌గా ఉండాలి. అక్క‌డి నుంచి వేరే ద‌గ్గ‌రికి వెళ్ల‌కూడ‌దు. అలా వెళితే ఆ రివార్డు సొమ్మును ఆ దేశ ప్ర‌భుత్వానికి మీరే ఎదురు చెల్లించాల్సి వ‌స్తుంది. కానీ అక్క‌డే శాశ్వ‌తంగా ఉంటే సొమ్ము ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను స్విట్ల‌ర్లాండ్ ప్ర‌భుత్వం అందిస్తోంది.

live in albinen switzerland they will give free home and cash reward

అయితే.. అంతా బాగానే ఉంది. కానీ… అక్క‌డ ఉంటే ఇల్లు, స్థ‌లం, రివార్డులు ఇస్తామంటున్నారు.. ఇందులో ఏమీ మ‌త‌ల‌బు లేదు క‌దా..! ఎందుకంటే ఇలా ఇస్తున్నారంటే అక్క‌డ దెయ్యాలు ఏమైనా ఉండి ఉంటాయి, అందుక‌నే ఇలాంటి ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు కాబోలు.. అని ఈ పాటికే అంద‌రికీ డౌట్ వ‌చ్చి ఉంటుంది. అయితే విష‌యం అది కాదు. ఎందుకంటే.. అక్క‌డ చాలా మంది నిరుద్యోగులు ఉన్నార‌ట‌. కొండ ప్రాంతం కావ‌డంతో అక్క‌డ ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు ఏవీ రావ‌డం లేద‌ట‌. దీంతో అక్క‌డ ఉన్న వారు ఇత‌ర ప్రాంతాల‌కు భారీగా వ‌ల‌స వెళ్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలో ఇప్పుడు అల్బినెన్ టౌన్ లో కేవ‌లం 240 కుటుంబాలు మాత్ర‌మే మిగిలాయ‌ట. ఇది ఇలాగే కొన‌సాగితే ఆ టౌన్ పూర్తిగా నిర్మానుష్య‌మైపోతుంద‌ని భావించిన స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం ఈ ఆలోచన చేసింది. ఏది ఏమైనా ఆ ప్ర‌భుత్వం ఆలోచ‌న భ‌లేగా ఉంది క‌దా..! మ‌రి మీకు ఎవ‌రికైనా ఆస‌క్తి ఉంటే ఓ ట్ర‌య‌ల్ వేసి చూడండి మ‌రి..!

Admin

Recent Posts