Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

వ్య‌క్తి క‌ళ్లు తెరిపించిన అవ్వ జీవితం.. ఎవ‌రినీ చిన్న‌చూపు చూడ‌కూడ‌దు..

Admin by Admin
February 25, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకు కూరలు… ఆకు కూరలు అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించయ్యా అన్నది ఆమె. పాలకూర కట్ట ఎంత? అడిగాడు. పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ. మరీ అన్యాయం… బయట అయిదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. నాలుగు తీసుకో నాయన.. కట్టలు తీసింది అవ్వ.

పదిరూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసలిదానికి… ఇవాళో రేపో చావబోతుంది… ఇంకా డబ్బు మూటలు కడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

man learnt a lesson with this old woman

కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ నానమ్మా… నన్ను స్కూల్ నుంచి పంపేశారు… ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ… బాబూ… కాస్త గంప కిందికి దించునాయనా అన్నది రవితో. ఏడవకమ్మా… నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే… నా తల్లే… ఇంటికిపొదాం పద అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.

రవికి అర్ధం కాలేదు. ఎవరీ పిల్ల..? అని అడిగాడు అవ్వను. నా మనవరాలు బాబూ…ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళబట్టీ పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు…పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు.. అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. ముసల్దానికి ఎంత డబ్బాశ అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు. పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి అవ్వా..ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.

బాబూ…ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ. అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు..నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను..రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోకకళ్యాణం.

Tags: old woman
Previous Post

ఉడకబెట్టిన గుడ్డు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకండి.. దాని అద్భుతమైన ప్రయోజనాలను చూడండి..

Next Post

2024 లో విడుదలైన రజాకార్ సినిమా ఎలా ఉంది ?

Related Posts

హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

July 16, 2025
information

పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

July 16, 2025
lifestyle

మీ ఇంట్లో వాట‌ర్ ప్యూరిఫైర్ ఉందా..? అయితే ఇలా చేయండి..!

July 16, 2025
ఆధ్యాత్మికం

హిందూ మ‌తంలో కుమారులు మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు అంత్య‌క్రియ‌లు చేస్తారు..?

July 16, 2025
వినోదం

చిరంజీవి ఫేవరెట్ ఆహారం ఏంటో తెలుసా..?

July 16, 2025
mythology

ప‌ర‌శురాముడి గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

July 16, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.