Off Beat

బెర్ముడా ట్ర‌యాంగిల్‌కి సంబంధించిన మిస్టరీ కథలు ఏమిటి? వాటిలో వాస్తవం ఎంత?

గడిచిన 100 సంవత్సరాలలో ,1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా ,అసలు అవి ఏమౌతున్నాయో కూడా ఎవరి ఊహకు అందకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా త్రిభుజం(Bermuda triangle). అసలు బెర్ముడా త్రికోణంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది చాలా సిద్ధాంతాలు (Theories) చెప్తుంటారు.అందులో 3 సిద్ధాంతాలు ప్రసిద్ధి చెందినవి,అవి ఏంటంటే..

సిద్ధాంతం-1.. సిటీ ఆఫ్ అట్లాంటిస్:- బెర్ముడా త్రికోణంలో ,అండర్ వాటర్లో ఒక రాయి ఏర్పడబడింది అని (Rock formation) కనిపెట్టారు.ఇది ఖచ్ఛితంగా మనుషులు చేత చేయబడినది అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరంకి చెందినదని,అట్లాంటిస్ నగరం బెర్ముడా త్రిభుజం క్రిందనే ఉందని అనుకుంటున్నారు.అప్ఫట్లో అట్లాంటిస్ నగరంకి పవర్ సోర్స్,అక్కడ ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదట.ఇప్పుడు బెర్ముడా త్రిభుజం క్రిందనున్న అట్లాంటిస్ నగరంలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లె ,అక్కడ కంపాస్లు సరిగ్గా పనిచేయవని,అక్కడ ఓడలు మరియు విమానాలు మాయమైపోవడానికి అవే కారణమని అంటుంటారు.

what are the mysteries behind bermuda triangle

సిద్ధాంతం-2.. గల్ఫ్ స్ట్రీమ్:- బెర్ముడా త్రిభుజం వద్ద సముద్రం లోతు 28,373 అడుగులు.అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ ప్రవాహంలా ప్రవహిస్తుందని,అక్కడ మునిగిపోయిన ఓడలు ఈ ప్రవాహం వలనే అక్కడే ఉండకుండా, దూరంగా వెళ్లి అక్కడ సముద్రం అడుగు భాగాన ఉండిపోతాయని చాలా మంది అంటుంటారు.ఇందువల్లనే అక్కడ మునిగిపోయిన ఓడలు ఆనవాళ్ళు ఏమి మిగలట్లేదు అని అంటుంటారు. సిద్ధాంతం-3.. మీథేన్ గ్యాస్:- బెర్ముడా త్రికోణం అడుగు భాగాన చాలా ఎక్కువ పరిమాణంలో మీథేన్ గ్యాస్ బుడగలు ఉన్నాయి.అవి ఎంతపెద్దవి అంటే ఒక్క బుడగ పగిలి గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద షిప్స్‌ని సైతం లోతుకి లాగగలవని,అందుకే షిప్స్ మాయం అవుతున్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తుంటారు.

ఈ థియరీసే కాకుండా ఇంకా అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉందని దాన్నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యాలు జరుగుతున్నాయని కొంత మంది చెప్తుంటారు.ఇంకొంతమంది అక్కడ వేరే ప్రపంచంకి వెళ్లే దారులు ఉన్నాయని చెప్తుంటారు.ఇవే కాకుండా అక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెప్తుంటారు.ఇలా చాలా థియరీస్ ఉన్నాయి.కారణం ఏదైనా ఇలా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.ప్రస్తుతం మనకున్న అడ్వాన్సడ్ టెక్నాలజీతో అసలైన బెర్ముడా త్రికోణం మిస్టరీని చేదించి మనందరి మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం చేకూర్చాలని కోరుకుందాం.

Admin

Recent Posts