భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కదా? అవును, ఆ శక్తి భూమికి ఎలా వచ్చింది? ఆ శక్తి భూమికి జన్మతః వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. సూర్యుని నుండి మహా విస్ఫోటనంతో విడిపోయిన, లేదా సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన దుమ్ము, రాళ్ళు, వగైరా పదార్ధం రకరకాల గ్రహాలుగా ఏర్పడే క్రమంలోనే అత్యంత శక్తితో , మహా గమనంతో ప్రయాణం మొదలు పెట్టాయి. కానీ ఈ లోపే సూర్యుడు ఆయా గ్రహాలను తన అమేయమైన ఆకర్షణ శక్తి ద్వారా అంతట్నీ తనలోకి లాక్కోవటం మొదలు పెట్టేసాడు. మొదలు పెట్టటం కాదు. ఈ తతంగమంతా సూర్యుని అయస్కాంత వలయం లోపలే జరుగుతోంది. అందుకే బయటికి పోలేకా, సూర్యుళ్ళోకి కలవటం ఇష్టం లేకా గ్రహాలు భ్రమణం చేస్తున్నాయి. మొదటిలో భూమికి రోజుకు పద్నాలుగు గంటలు మాత్రమే వుండేవి. క్రమేపీ ఆ గమనం మందగిస్తోంది. ఇప్పుడు 24 గంటలకి వచ్చాము.
సూర్యుని నుండి మహా విస్ఫోటనంతో విడిపోయిన, లేదా సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన దుమ్ము, రాళ్ళు, వగైరా పదార్ధము రకరకాల గ్రహాలుగా ఏర్పడే క్రమంలోనే అత్యంత శక్తితో , మహా గమనంతో ప్రయాణం మొదలు పెట్టాయి“ అనగానే ఎందుకు మొదలు పెట్టాయి? అనే సందేహం వస్తే మీలో చాలా ఉత్సుకత వున్నట్టు. జవాబేంటంటే, ఏ విస్ఫోటనం జరిగినా పేలుడు జరిగినా పదార్ధాలన్నీ కేంద్రం నుండీ దూరమే జరుగుతాయి కదా! అలాగే గ్రహాలు, గ్రహశకలాలూ విసిరివేయబడే.. లోపలే, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా మరలా వెనక్కి లాగివేయబడుతున్నాయి, ఇలా సూర్యుడు పెట్టే టార్చర్, విస్ఫోటనం చెంది దూరం పోలేకా, ఆకర్షణకులోనై ఐక్యం కాలేకా … వాటి ఫలితమే, భూభ్రమణము. !
ఆ శక్తి అయిపోతే, భూమి తిరగటం ఆగిపోతుందా? ఆగిపోతుంది. భూమి శక్తి సన్నగిల్లినా, సూర్యుని శక్తి సన్నగిల్లినా, భూమి స్వభ్రమణము – రొటేషన్ అంటున్నాను, అది అవసరం వుండదు. భూమి శక్తి అయిపోతే భూమి సూర్యుడిలోకీ, సూర్యుడి శక్తి అయిపోతే భూమి రోదసిలోకీ ప్రయాణం చేస్తాయి. అదంతటికీ తక్కువలో తక్కువ ఐదు వందల కోట్ల సంవత్సరాల సమయం వుంది. అయితే భూమి తిరగడం ఆగిపోతే తీవ్రమైన ఉత్పాతాలు జరుగుతాయి. 6 నెలల పాటు భూమిపై ఒకవైపు తీవ్రమైన చలి ఉంటే మరోవైపు తీవ్రమైన వేడి ఉంటుంది. కాలాలు మారిపోతాయి. సముద్రాలు స్థానభ్రంశం చెందుతాయి. సునామీలు ఏర్పడుతాయి. తుఫాన్లు, భూకంపాలు వస్తాయి. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి పోతుంది. శాటిలైట్లు పనిచేయవు. కిరణ జన్య సంయోగ క్రియ జరగదు. ఫలితంగా చెట్లు కాయలను కాయవు. జీవులకు ఆహారం లభించదు.