Off Beat

బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు.

అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రొడక్ట్ ను హైలెట్ గా చేసే విధంగా ఉండాలని అనుకుంటారు. ఉదాహరణకు సర్జరీ చేసేటప్పుడు వైద్యులు ఆపరేషన్ గదిలో ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు. ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుంది.

why gold is wrapped in pink color paper

బంగారం మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు సరైన విధంగా కనిపించాలంటే వెనకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ మంచిగా అట్రాక్షన్ గా ఉండాలి. అందుకోసమే వెండి లేదా బంగారం వస్తువు లను అమ్మేవారు పింక్ పేపర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. నలుపు చాలామంది అశుభ సూచకంగా ఉపయోగిస్తారు. ఇక ఆ రంగు కాకుండా పింక్ రంగు పేపర్ అయితే బంగారం మెరుపును అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే పింక్ కలర్ పేపర్ ను ఉపయోగిస్తారు.

Admin

Recent Posts