మన దేశంలో ప్రతి ఒక ఫ్రొఫెషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంది.డాక్టర్లు వైట్ ఆప్రాన్ లో కనిపిస్తే..పోలీసులు ఖాకీ డ్రెస్ ధరిస్తారు…ఇంజనీర్స్ ని హెల్మెట్ పెట్టుకుంటే గుర్తుపడతాం….ప్రపంచంలో డాక్టర్స్ అంతా ఒకే కలర్ ఒకే కలర్ డ్రెస్ కోడ్ ఉన్నా లాయర్స్ డ్రెస్సింగ్ మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది..మన దేశంలో లాయర్స్ డ్రెస్ కోడ్ గురించి తెలుసుకోండి…
మన దేశంలో ప్రస్తుతం లాయర్స్ కి ఉన్న డ్రెస్ కోడ్ 16వ శతాబ్దంలోది.. 1685 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ రాజు ఛార్లెస్ 2 చనిపోయినప్పుడు ప్రజలందరూ నల్లటి పొడవైన గౌన్లు ధరించి తమ బాదను తెలిపారట..అప్పట్లో న్యాయవాదులు,న్యాయమూర్తులు పట్టా తీసుకునే వాళ్లు నల్లగౌను ధరించేవారట..బ్రిటీష్ వారిపై మన భారతీయ సంస్కృతి ప్రభావం చాలానే ఉంది ఇప్పటీకి ఏదో ఒక అంశం ద్వారా ప్రూవ్ అవుతుంది..అలాగే లాయర్ల డ్రెస్ కోడ్ మార్చడంలో కూడా ..మనం శాంతి కి ,మంచితనానికి గుర్తుగా భావించే తెలుపు రంగును న్యాయమూర్తుల వస్థ్రధారణలో భాగం చేయాలని బ్రిటీష్ వారు భావించారట…లాయర్ల దగ్గరకు వచ్చే సామాన్య ప్రజలు వారి నుండి ఆశించే న్యాయానికి,మంచితనానికి గుర్తుగా నలుపు చొక్కాతో పాటు తెలుపు రంగు చొక్కా కూడా ధరించాలని 1691లో చట్టం చేసారు ..
మన దేశ లాయర్లు డ్రెస్ కోడ్ లో నల్లకోటు ,తెల్లచొక్కా తో పాటు మెడ చుట్టూ ఉంటే తెల్లటి పట్టీ కంపల్సరీ గా ఉంటుంది..క్రైస్తవంలో 10 కమాండ్ మెంట్సుకు ఒక విశిష్టత ఉంది…వాటిల్లో మనిషి ఎలా నడుచుకోవాలనే దేవుడు రూపొందించిన చట్టాలు మనిషికి శిలాశాసనం లాంటివి… వాటికి ప్రతీకగా ఈ తెల్లపట్టీ వాడుతున్నారు…మనిషి జీవనంలో వాటికి ఎంత విశిష్టత ఉందో న్యాయవాదుల మెడలో ధరించే తెల్లపట్టీకి అంతే విశిష్టత ఉంది..లాయర్ల డ్రెస్ కోడ్ లో తెల్లపట్టీ విధానం కూడా మనకు ఇంగ్లాండువారి నుండే వచ్చింది..