Shankhapushpi : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. దీన్ని అసలు వదలకండి..!

Shankhapushpi : మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మొక్కలు ఔషధగుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటి భాగాలను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక అలాంటి ఔషధ మొక్కల్లో శంఖపుష్పి మొక్క ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే విస్తృతంగా పెరుగుతుంది. కానీ ఇది ఔషధ మొక్క అని చాలా మందికి తెలియదు. ఇక దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

drink Shankhapushpi flower water for these benefits
Shankhapushpi

శంఖపుష్పి మొక్కకు చెందిన పువ్వులు నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. అయితే మనకు నీలం రంగు పువ్వులను పూసే మొక్క వల్లే ఉపయోగాలు కలుగుతాయి. ఆ నీలం రంగు పువ్వులు రెండు మూడు తెచ్చి శుభ్రంగా కడగాలి. కప్పున్నర నీటిలో వాటిని వేసి పది నిమిషాల పాటు సన్నని మంటపై ఆ నీళ్లను మరిగించాలి. తరువాత ఆ నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి అవి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు ఒకసారి తాగినా చాలు.. అనేక లాభాలు కలుగుతాయి.

1. శంఖపుష్పి పువ్వుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. విద్యార్థులకు అయితే బ్రెయిన్‌ షార్ప్‌గా మారుతుంది. దీంతో చదువుకున్నది బాగా వంటబడుతుంది. పరీక్షల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి వారు రోజూ ఈ పువ్వులతో చేసే నీళ్లను తీసుకోవాలి.

2. శంఖపుష్పి పువ్వులతో చేసే నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

3. డిప్రెషన్‌ సమస్య ఉన్నవారు ఈ నీళ్లను తాగితే దెబ్బకు ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

4. ఈ పువ్వుల్లో ఉండే బయో యాక్టివ్‌ సమ్మేళనాలు రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. కనుక హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా నిరోధించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5. శంఖపుష్పి నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలోకి వస్తాయి. ఇలా ఈ పువ్వుల నీళ్లతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts