Gaddi Gulabi : మనం ప్రతిరోజూ అనేక రకాల మొక్కలను చూస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైనా చక్కగా ఆకర్షణీయంగా ఏదైనా మొక్క కనిపిస్తే దానిని వెంటనే తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. అలాంటి అందమైన మొక్కలల్లో గడ్డి గులాబి మొక్క కూడా ఒకటి. అలాగే దీనిని నేల గులాబి, చిట్టి గులాబి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా అనేక రంగుల్లో ఉంటాయి. ఈ మొక్క ఎలాంటి ప్రదేశంలో అయినా చాలా సులభంగా పెరుగుతుంది. దీనిని పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. నేలపైపాకుతూ పెరిగే ఈ మొక్కను చాలా మంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు.
ఈ మొక్కలు మన పెరటికి మన ఇంటికి చక్కటి అందాన్ని తీసుకు వస్తాయి. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ మొక్కను చాలా మంది సాధారణ పూల మొక్కగా భావిస్తారు. కానీ ఈ గడ్డి గులాబి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మొటిలు, మచ్చలను తగ్గించడంలో ఈ మొక్క చక్కగా పని చేస్తుంది. దీని కోసం గడ్డి గులాబి ఆకులను, పూలను సేకరించి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనికి తేనెను కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత చల్లటి నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది. అలాగే ఈ మొక్క ఆకులను పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికి కొబ్బరి నూనెను లేదా బాదవం నూనెను కలిపి జుట్టు పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య నివారించబడుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే గాయాల నుండి రక్తం ఆగకుండా ఎక్కువగా కారిపోతూ ఉంటే గడ్డి గులాబి మొక్కను పేస్ట్ లాగా చేసి గాయాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. ఈ విధంగా గడ్డి గులాబి మొక్కలు మనకు ఎంతో సహాయపడతాయని అయితే వీటిని ఉపయోగించేటప్పుడు వీటి ఆకుల రసం కళ్లల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.