Coriander Leaves : కొత్తిమీర.. ఇది మనందరికీ తెలిసిందే. వంటల తయారీలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తాము. కొత్తిమీరతో చేసే పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తిమీరను వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కొత్తిమీరను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీరను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్త హీనతను తగ్గించడంలో కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరను వాడడం వల్ల పొగ త్రాగడం, కీమోథెరపీ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. బరువు తగ్గడంలో, రక్త నాళాలలో ఆటంకాలను తొలగించంలో కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది.
కేవలం వంటల్లోనే కాకుండా కొత్తిమీర ఔషధ గుణాల పరంగా కూడా ఉపయోగపడుతుంది. కొత్తిమీర గింజలు, కాండం, ఆకులు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆహారం విషతుల్యం కాకుండా చేయడంలో కొత్తిమీర సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరిచేదిగా, మూత్రం సాఫీగా వచ్చేలా చేసేదిగా, లైంగిక శక్తిని పెంచేదిగా, యాంటీ సెప్టిక్ గా కూడా కొత్తిమీర పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కొత్తిమీర రసం ఔషధంగా పని చేస్తుంది. రెండు టీ స్పూన్ల కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల స్త్రీలలో అండాశయాల పని తీరు మెరుగుపడుతుంది. జ్వరాన్ని తగ్గించడంలో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో కూడా ఈ రసం ఉపయోగపడుతుంది. కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తునప్పుడు కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల ఆ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
వికారాన్ని, హెపటైటిస్ ను, అర్ష మొలలు, బంక విరోచనాలు, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా కొత్తిమీర రసం సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులను నమిలి మింగడం వల్ల నోటి దుర్వాసన, నోటి పూత, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. కొత్తిమీర రసంలో పసుపును కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చల వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ చిట్కాను రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్న తరువాత వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 20 గ్రాముల కొత్తిమీరలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది. కొత్తిమీరను దంచి ముద్దగా చేసి దానికి వేడి చేసిన ఎర్ర మట్టిని కలిపి లేపనంగా రాస్తూ ఉండడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది.
స్త్రీలలో బహిష్టు సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే తాజా కొత్తిమీర రసంలో పంచదారను కలిపి తాగుతుంటే రక్తస్రావం ఎక్కువగా అవకుండా ఉంటుంది. తరచూ కొత్తిమీర పచ్చడిని తినడం వల్ల లేదా క్రమం తప్పకుండా రాత్రి పూట కొత్తిమీర రసానికి తేనెను కలుపుకుని తాగడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి వంటి విటమిన్ల లోపాలు తగ్గుతాయి. కొత్తిమీర ఆకును దంచి దానిని కణతలకు, నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పితోపాటు మైగ్రేన్ తలనొప్పి, కణతల నొప్పి కూడా తగ్గుతుంది.
కొత్తిమీరను, బాదం పప్పును కలిపి దంచి ఆ మిశ్రమాన్ని నొప్పులపై, వాపులపై పట్టులా వేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర రసానికి తేనెను, బాదం నూనెను కలిపి రాసుకోవడం వల్ల చర్మం పై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. స్మాల్ పాక్స్ బారిన పడినప్పుడు రోజూ ఒక టీ స్పూన్ కొత్తిమీర రసాన్ని అరటి పండుతో కలిపి వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొత్తిమీరను వంటల్లో వేయడమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.