Indigo Leaf : మనకు గ్రామాల్లో ఎక్కువగా కనిపించే వివిధ రకాల చెట్టల్లో నీలి చెట్టు కూడా ఒకటి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నీలి చెట్టు కాయలు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి. ఈ చెట్టు ఆకులను చేత్తో నలిపితే చేతులు నీలి రంగులోకి మారుతాయి. ఈ రంగు చేతులపై 4 నుండి 5 రోజుల పాటు అలాగే ఉండేది. ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, బీడు భూముల్లో పెరుగుతాయి. వర్షాకాలంలో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. పూర్వకాలంలో ఈ చెట్టు నుండి నీలి మందును తయారు చేసి బట్టలకు వేసేవారు. ఇలా నీలిమందు వేసిన బట్టలను ధరించడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఈ చెట్టు ఆకులను ఉపయోగించి మనం తెల్ల జుట్టును చాలా సులభంగా నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా నీలి చెట్టు ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి పొడిగా చేయాలి. అయితే ఈ నీటి చెట్టు ఆకుల పొడిని తలకు పట్టించడానికి ముందు మనం గోరింటాకును తలకు పట్టించాల్సి ఉంటుంది. గోరింటాకును నూరి తలకు పట్టించాలి. ఆరిన తరువాత షాంపు పెట్టకుండా శుభ్రంగా నీటితో కడిగి వేయాలి. మరుసటి రోజు నీటి చెట్టు ఆకుల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను వెంట్రుకలకు పట్టించి ఆరిన తరువాత కడిగి వేయాలి. దీనిని ఉపయోగించిన వెంటనే వెంట్రుకలు నల్లగా మారవు. మరుసటి రోజు మనకు జుట్టు నల్లగా మారుతుంది.
ఇలా చేయడం వల్ల మనం చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే మరో పద్దతి ద్వారా కూడా మనం జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం నీలి చెట్టు ఆకుల రసాన్ని తీసుకోవాలి. దీనికి సమానంగా నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై నూనె మిగిలే వరకు మరిగించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజుకు రెండు పూటలా జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా పట్టించాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు నల్లగా మారడానికి సమయం పట్టినప్పటికి నల్లగా మారిన జుట్టు శాశ్వతంగా నల్లగానే ఉంటుంది. పాముకాటుకు విరుడుగా కూడా ఈ చెట్టు పని చేస్తుంది.
పాము కరిచిన వెంటనే నీలి చెట్టు ఆకులను 10 గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలోవేసి బాగా నలపాలి. తరువాత ఈ నీటిని వడకట్టి పాము కరిచిన వ్యక్తికి తాగించాలి. ఇలా అరగంటకొకసారి రోగి బ్రతికే వరకు తాగించాలి. అలాగు రోగిని నిద్రపోకుండా చూసుకోవాలి. పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో కూడా నీలి చెట్టు మనకు సహాయపడుతుంది. ఈ చెట్టు వేరును చిన్న ముక్క తీసుకుని పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను పిప్పి పన్ను లోపల ఉంచడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా నీలి చెట్టు మనకు సమాయపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.