Nela Thangedu : మన చుట్టూ ఉండే పరిసరాల్లో అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు పెరుగుతుంటాయి. అయితే వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి ఎవరికీ తెలియదు. అలాంటి మొక్కల్లో నేల తంగేడు మొక్క ఒకటి. దీని ద్వారా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు ఈ మొక్క భాగాలు పనిచేస్తాయి. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నేల తంగేడు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి పుష్టి, బలం లభిస్తుంది.
2. ఆవు నెయ్యి, చక్కెర, నేల తంగేడు చూర్ణంలను తీసుకుని తగిన భాగాల్లో కలిపి తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. నేల తంగేడు చూర్ణాన్ని దానిమ్మ పండ్ల రసంతో తీసుకుంటూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
4. నేల తంగేడు చూర్ణాన్ని పాలలో కలిపి తీసుకుంటే శరీరం కాంతివంతంగా మారుతుంది.
5. శృంగార సమస్యలతో బాధపడుతున్న పురుషులు ఈ చూర్ణాన్ని రోజూ పాలతో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
6. నేల తంగేడు చూర్ణాన్ని ఖర్జూర పండుతో కలిపి తీసుకోవాలి. ఆకలి పెరుగుతుంది.
7. పాత బెల్లం, నేల తంగేడు చూర్ణం కలిపి తీసుకుంటే కడుపులో ఉండే మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
8. పాలలో ఈ చూర్ణం కలిపి తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలు పోతాయి. దృష్టి సరిగ్గా ఉంటుంది.
9. నేల తంగేడు చూర్ణాన్ని రోజూ వాడుతూ ఉంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
10. పటికబెల్లం, నేల తంగేడు చూర్ణం కలిపి తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
11. అరటి పండ్లలో ఈ చూర్ణాన్ని పెట్టి రోజూ తింటుంటే నేత్ర వ్యాధులు పోతాయి. రేచీకటి నుంచి బయట పడవచ్చు.
12. ఖర్జూరాలతో ఈ చూర్ణాన్ని కలిపి తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
13. తంగేడు చెట్టు కాండం మీది బెరడుతో సమంగా నువ్వుల పిండి కలిపి పూటకు ఒక చెంచా చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. 40 రోజుల పాటు తీసుకుంటే దీర్ఘకాలంగా వున్న అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుంది.
14. ఈ మొక్క విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీ చేసుకుని తాగితే గుండె దడ తగ్గిపోతుంది. దీంతో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతాయి.
15. తంగేడు మొక్క లేత ఆకులు గుప్పెడు తీసుకుని రెండు చిటికెల గవ్వ పలుకుల బూడిద కలిపి టాబ్లెట్స్ లా చేసి రోజుకు రెండు తీసుకోవాలి. వీర్యవృద్ధి కలిగి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.
16. తంగేడు మొక్క పుల్లలను తెంచి వాటితో దంతాలను తోముకోవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
17. దీర్ఘకాలంగా ఉన్న తెల్లబట్ట వ్యాధి తగ్గడానికి ఈ మొక్క వేరు బెరడు నూరి ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు.
18. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
19. విరిగిన ఎముకలకు పట్టుగా తంగేడు ఆకులు వాడుతారు. విరిగిన లేదా బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు ఏర్పడకుండా త్వరగా ఎముక అతుక్కుంటుంది.
20. నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు ఈ మొక్క ఆకులను నూరి మాత్రలుగా చేసి ఇస్తే వారం రోజులకు పూత, పుండు తగ్గుతాయి.
21. తంగేడు పువ్వుల రెక్కల కషాయం మధుమేహానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పరగడుపున తంగేడు పువ్వులను తీసుకుని వాటిలో 15 రెక్కలను సేకరించాలి. వాటిని ఒక గ్లాసుడు నీళ్ళలో వేసి మరిగించి చల్లార్ఛి సేవించాలి. ఇది తీసుకున్న తరువాత ఒక గంట వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు చేస్తే గుణం కనిపిస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
22. ఈ చెట్టు వేరు కషాయం కాచుకొని తాగుతుంటే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి. 5 ఎంఎల్ తంగేడు చెట్టు బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోతుంది.
23. తంగేడు చెట్టు లేత ఆకులను నమిలి మింగితే దగ్గు తగ్గుతుంది. తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గిపోతుంది. తంగేడు లేత ఆకుతోపాటు రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదుల పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.
24.తంగేడు ఆకుని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ఆ చూర్ణాన్ని గోరువెచ్చటి నీటితో రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.
25. తంగేడు ఆకు చిగుళ్లను మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి. తంగేడు చిగుళ్లను మజ్జిగలో నూరి పాదాలకు రాస్తుంటే కాలిపగుళ్ళు తగ్గుతాయి.
26. తంగేడు లేత చిగుళ్లను మాడుమీద వేసి గట్టిగా తలకు కడుతుండాలి. దీంతో తలపోటు, తలనొప్పి తగ్గిపోతాయి. నేత్రరోగాలు నివారించబడతాయి.
మార్కెట్‌లో మనకు నేల తంగేడు చూర్ణం లభిస్తుంది. దీన్ని కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు. లేదా ఆకులను, పువ్వులను నీడలో ఎండ బెట్టి పొడి చేసి ఆ చూర్ణాన్ని స్వల్ప మోతాదులో వాడుకోవచ్చు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఇలా వాడుకోవాల్సి ఉంటుంది.