Thalambrala Mokka : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Thalambrala Mokka : ఈ భూమి మీద ప‌నికి రాని మొక్క అంటూ ఏది ఉండ‌దు. అయితే ఆ మొక్క‌ను ఉప‌యోగించే విధానం తెలియ‌క మ‌నం క‌లుపు మొక్కగా భావిస్తూ ఉంటాం. ఇలా క‌లుపు మొక్క‌గా భావించే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తాకోడ‌ళ్ల మొక్క అని కూడా అంటారు. ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల గట్ల మీద, చేను కంచెల వెంబ‌డి విరివిరిగా పెరుగుతుంది. ఈ మొక్క పొద‌లాగా పెరుగుతుంది. పంట పొలాల చుట్టూ ఈ మొక్క పెరిగితే పొలాల‌కు పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయని రైతులు న‌మ్ముతారు. ఈ మొక్క లాంటానా అనే జాతికి చెందిన మొక్క. దీనిలో 150 కి పైగా జాతులు ఉంటాయి. ఈ మొక్క పూలు చిన్న‌గా వివిధ రంగుల్లో చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క‌ను ఉప‌యోగించి ఫ‌ర్నీచ‌ర్ ను, కంచెల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే బుట్ట‌లు, గంప‌లు వంటి వాటిని కూడా ఈ మొక్క క‌ల‌ప‌తో త‌యారు చేస్తూ ఉంటారు.

చాలా మంది ఈ మొక్కను ఒక క‌లుపు మొక్క‌గానే చూస్తారు. ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. త‌లంబ్రాల మొక్క పూలు, ఆకులు, వేర్లు అన్నీ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క కాయ‌ల‌ను కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు. కానీ ఈ మొక్క కాయ‌ల్లో ఒక ర‌క‌మైన విషం ఉంటుంద‌ని అనేక ర‌కాల ప‌రిశోధ‌నల్లో తేలింది. క‌నుక ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యలు, ఉబ్బ‌సం, క్యాన్స‌ర్, కుష్టు, ర్యాబిస్, చికెన్ ఫాక్స్ కు ఉప‌యోగించే ఔష‌ధాల్లో త‌యారీలో త‌లంబ్రాల మొక్కను విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ మైక్రో బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. గాయాల‌ను న‌యం చేయ‌డంలో త‌లంబ్రాల మొక్క ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి గాయాల‌పై లేప‌నంగా రాయాలి.

Thalambrala Mokka benefits in telugu know how to use
Thalambrala Mokka

ఇలా రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. అలాగే ఈ మొక్క ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించాలి. త‌రువాత ఆ నీటితో ఆవిరి పీల్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. విష ప్ర‌భావాన్ని త‌గ్గించే గుణం కూడా ఈ మొక్క‌కు ఉంది. త‌లంబ్రాల మొక్క ఆకుల ర‌సాన్ని పాముకు కాటుకు గురైన చోట రాయాలి. అలాగే ఆకుల పిప్పిని పాటు కాటుకు గురైన చోట ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల విష ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను కీళ్ల నొప్పుల‌పై ఉంచి ఊడిపోకుండా క‌ట్టుక‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే ఈ మొక్క ఆకుల‌కు ఆముదాన్ని క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని కీళ్ల నొప్పుల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి.

ఇలా రాత్రి ప‌డుకునే ముందు క‌ట్టుకుని ఉద‌యాన్నే తీసి వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల కూడా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను కాల్చగా వ‌చ్చిన పొగ‌తో ఇంట్లో ధూపం వేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే దోమ‌లు, కీట‌కాలు న‌శిస్తాయి. అలాగే ఈ మొక్క పూల‌ను కూడా క్ష‌య వ్యాధికి వాడే ఔష‌ధాల తయారీలో ఉప‌యోగిస్తారు. ఈ విధంగా త‌లంబ్రాల మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొందవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts