politics

ఒకవేళ అమెరికా ఆర్థికంగా పతనమయితే తరువాత అగ్ర రాజ్యం అయ్యే అవకాశం ఏ దేశానికి ఉంది ?

అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా పతనం కావడం అనేది కలలో మాట. వారు గనక ఒకచోట నష్టపోతే మరొక చోట లాభపడతారు. వారి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది. ఎక్కడైనా యుద్ధం జరిగితే ఇది వరకు అమెరికా వాళ్ళు సైనిక సహాయం చేసేవారు. అక్కడ వారు కూడా ఎదిగిపోయారు. వియత్నాంలో అలాగే నష్టపోయారు. 50 వేల మంది సైన్యం చనిపోయారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఆఫ్గానిస్థాన్ నుండి కూడా అలాగే విత్ డ్రా అయిపోయారు. ఆర్థిక సాయం చేస్తున్నారు, మిలటరీ సాయం చేస్తున్నారు, అంతేగానీ అమెరికా వారు యుద్ధం చేయటం లేదు.

ఆయుధాలు ఇచ్చి వడ్డీతో సైతం అప్పు వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పుడు ukraine యుద్ధం కూడా అంతే.. ఆయుధాలు ఆర్థిక సాయం చేస్తున్నారు కానీ సైన్యాన్ని దింపడం లేదు. అదే స్ట్రాటజీ అన్ని దేశాల్లో చేస్తున్నారు. కాబట్టి బయటి దేశాల్లో యుద్ధాన్ని తన వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు అమెరికా ఆర్థికంగా నష్టపోతే తర్వాత వచ్చేది చైనా. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 26 వేల ట్రిలియన్ డాలర్స్ తో మొదటి స్థానంలో ఉంది. సుమారు 18వేల ట్రిలియ‌న్‌ డాలర్స్ తో చైనా రెండో స్థానంలో ఉంది కాబట్టి అమెరికా నష్టపోయే సమస్య లేదు. తగ్గితే రెండు మూడు ట్రిలియన్స్ తగ్గవచ్చు, అంతేకానీ పూర్తిగా నష్టపోదు.

if america economy falls then who will become first

మూడో ప్లేసులో ఎవరూ కూడా దగ్గరలో లేరు. రష్యాని చూస్తున్నాం కదా చిన్న దేశం ఉక్రెయిన్ మీద గెలవలేకపోయారు. ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుండి యుద్ధం చేస్తున్నారు. ఇక మన దేశం ఆర్థికంగా సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఉంది. అంటే చైనాకి మనకి 14 ట్రిలియన్ డాలర్స్ తేడా ఉంది. ఏ రకంగానూ వాళ్లతో మనం పోటీ వడలేము. ఎలా చూసినా అమెరికా మొదటి స్థానంలో అలాగే ఉంటుంది, చైనా రెండో స్థానంలో ఉంటుంది.

Admin

Recent Posts