మనకు అందుబాటులో ఉన్న పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఇవి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల్లో మనకు లభిస్తున్నాయి. వీటిలో భిన్న రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అందువల్ల వాటితో మనకు పోషణ, శక్తి లభిస్తాయి. అయితే ద్రాక్ష పండ్లను తింటే బరువు పెరుగుతారా ? అంటే..
ద్రాక్ష పండ్లను తక్కువ క్యాలరీలు ఉన్న పండ్లుగా చెప్పవచ్చు. 100 గ్రాముల ద్రాక్షలను తిన్నా కేవలం 50 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. అందువల్ల ద్రాక్షలను తింటే బరువు పెరగరు. వాటిని నిరభ్యంతరంగా తినవచ్చు.
అయితే ద్రాక్షలు తియ్యగా ఉంటాయి. బాగా పండినవి అయితే చక్కెర శాతం 20 నుంచి 30 వరకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ద్రాక్షలను మరీ ఎక్కువగా తినరాదు. మోతాదులో తింటే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
బాగా పండిన ద్రాక్షలను తింటే చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని తక్కువగా తినాల్సి ఉంటుంది. అదే సాధారణ ద్రాక్ష అయితే క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక ఎక్కువ తిన్నా ఏమీ కాదు. కనుక ద్రాక్షలను మోతాదులో తింటే బరువు పెరగరు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.