Curd : మనలో చాలా మందికి భోజనం చివర్లో పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్టే ఉండదు. చక్కటి రుచిని కలిగి ఉండే గడ్డ పెరుగును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పెరుగును ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే పెరుగును తినరు. పెరుగును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం పెరుగును తినని వారు కూడా పెరుగును ఇట్టే తినేస్తారు. పెరుగును తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడిని కలుపుకుని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
అలాగే నల్ల ఉప్పును పొడిగా చేసి కప్పు పెరుగులో కలుపుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా పెరుగులో పంచదారను కలుపుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేయడంతోపాటు తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. నోటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు పెరుగులో వామును కలుపుకుని తినడం వల్ల నోటి దుర్వాసన, దంతాల నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి నోటి సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కప్పు పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది. కండరాల పుష్టికి వ్యాయామం చేసే వారు పెరుగులో ఓట్స్ ను కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం తరచూ ఇన్ ఫెక్షన్ లబారిన పడకుండా ఉంటాం. గర్భిణీ స్త్రీలు పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం ముక్కలు కలిపి తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే పెరుగులో నారింజ పండ్ల రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
కడుపులో అల్సర్లతో బాధపడే వారు పెరుగులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల అల్సర్లు త్వరగా మానిపోతాయి. పెరుగును చాలా మంది మూడు పూటలా తింటూ ఉంటారు. మన శరీరానికి మేలు చేస్తుంది కదా అని దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. పెరుగును మితంగా తీసుకుంటేనే మన శరీరానికి మేలు కలుగుతుంది. అయితే చాలా మంది పెరుగును రాత్రి పూట తినవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. పిల్లలకు కూడా రాత్రి పూట పెరుగును ఆహారంగా ఇవ్వరు. రాత్రి సమయంలో పెరుగును తినడం వల్ల దగ్గు, జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. పెరుగన్నాన్ని రాత్రి పూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కఫం వస్తుంది.
తరచూ దగ్గు, జలుబు వంటి వాటితో బాధ పడే వారు రాత్రి పూట పెరగన్నాన్ని తినకపోవడమే మంచిది. ఇలాంటి వారు మధ్యాహ్న వేళల్లో మాత్రమే పెరుగన్నాన్ని తీసుకోవాలి. చిన్న పిల్లలు, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడే వారు తప్ప ఎవరైనా రాత్రి పూట పెరగన్నాన్ని తీసుకోవచ్చు. పెరుగు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో సౌందర్యానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి.
పెరుగులో శనగపిండిని కలిపి చర్మానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టుకు కూడా పెరుగు ఎంతగానో మేలు చేస్తుంది. స్నానం చేసేటప్పుడు పెరుగును తీసుకుని జుట్టు కుదుళ్లలోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా తయారవుతుంది. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.