ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజూ శారీరక శ్రమ చేయడం లేదు కనుక రోజూ కొంత సమయం వీలు చూసుకుని జిమ్ చేస్తున్నారు. అందుకనే గ్రామాల్లో సైతం ఇప్పుడు జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలటే వాస్తవానికి జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అది ఎలాగంటే..
పూర్వం మన పెద్దలు రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారం తినేవారు. ఉదయం పనికి వెళ్లిన తరువాత 11 గంటలకు భోజనం తినే వారు. తిరిగి రాత్రి 7 గంటల వరకు భోజనం చేసి నిద్రించేవారు. అది కూడా అప్పట్లో ఇప్పుడు దొరికినట్లు బియ్యం ఎక్కువగా ఉండేవి కావు. కనుక రాగులు, సజ్జలు, జొన్నలను తినేవారు. దీంతో సహజంగానే వారు ఫిట్‌గా ఉండేవారు. ఎలాంటి అనారోగ్యాలు వచ్చేవి కావు.
అయితే పూర్వం మన పెద్దలు అవలంబించిన రోజుకు 2 సార్లు తినడం అనే ప్రక్రియను ప్రస్తుతం విదేశాల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి పాటిస్తున్నారు. అంటే రోజులో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారన్నమాట. మిగిలిన సమయం అంతా ఎలాంటి ఆహారం తీసుకోరు. ఉదాహరణకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య భోజనం తింటారు. ఆ తరువాత మళ్లీ తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉంటారు. ఎలాంటి ఆహారం తినరు.
ఇలా ఎవరికి నచ్చినట్లు వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయవచ్చు. కానీ 6 గంటల వ్యవధిలోనే ఆహారం తినాలి. మిగిలిన 18 గంటలు శరీరాన్ని ఖాళీగా ఉంచాలి. ఎలాంటి ఆహారం తీసుకోరాదు. దీంతో శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయి.
ఇక పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బియ్యం కాకుండా.. రాగులు, సజ్జలు, జొన్నలు, ఇతర చిరుధాన్యాలు, పండ్లు, పాలను ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలను తినాలి. దీంతో అనేక పోషకాలు లభిస్తాయి. ఇలా ఆహారంలో మార్పులు చేసుకోవడంతోపాటు రోజులో ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఆహారం తింటే.. శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
ఈ విధంగా షెడ్యూల్ పాటించాలనుకుంటే డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ల సలహా తీసుకోవాలి. దీంతోపాటు రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ విధంగా జిమ్ కు వెళ్లకుండానే పలు మార్పులను చేసుకుంటే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.