Warm Water : రోజూ ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం తెలిసిందే. పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే అనేక లాభాలు పొందవచ్చు. మలబద్దకం సమస్య అన్నది ఉండదు. జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. పేగులు, జీర్ణాశయం అన్నీ శుభ్రమవుతాయి. లివర్ క్లీన్ అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. దీంతో మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే పరగడుపున గోరు వెచ్చని నీళ్లను ఎంత మోతాదులో తాగాలి.. ఎన్ని నీళ్లను తాగితే ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న విషయాలపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. మరి అందుకు వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే..
ఉదయం పరగడుపునే కనీసం 3 గ్లాసుల మేర గోరు వెచ్చని నీళ్లను తాగాలి. అంత మోతాదులో నీళ్లను తాగితేనే లాభాలు కలుగుతాయి. ఉదయం మన జీర్ణాశయంలో యాసిడ్ లెవల్స్ అధికంగా ఉంటాయి. కనుక కనీసం 3 గ్లాసుల గోరు వెచ్చని నీళ్లను తాగితేనే యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తప్పకుండా 3 గ్లాసుల నీళ్లను అయితే తాగాలి.
అయితే అన్ని నీళ్లను ఒకేసారి తాగలేం అనుకునేవారు కొద్ది కొద్దిగా తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఒకేసారి 3 గ్లాసుల నీళ్లను తాగే శక్తి వస్తుంది. ఇక ఇలా నీళ్లను తాగడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్ సమస్యల నుంచి బయట పడవచ్చు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.