Hair Bath : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సంబంధ సమస్యలను చాలా ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం, బలహీనంగా మారడం.. వంటి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వీటికి అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, వంశపారంపర్యత.. వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే జుట్టు విషయంలో చాలా మందికి ఒక సందేహం ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. అదేమిటంటే..
తరచూ తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని భయపడుతుంటారు. ముఖ్యంగా పురుషులు తమకు బట్టతల వస్తుందని అనుకుంటారు. అయితే అదంతా అబద్ధమేనని, తరచూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందని అనుకోవడంలో ఎంత మాత్రం నిజం లేదని.. వాస్తవానికి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ తలస్నానం చేయాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక స్త్రీలు అయితే వారంలో 3 నుంచి 4 సార్లు తలస్నానం చేయవచ్చని.. పురుషులు వారంలో 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయవచ్చని.. వైద్యులు చెబుతున్నారు. అంతేకానీ.. ఇలా తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందని భయపడాల్సిన పనిలేదని అంటున్నారు.
ఇక చుండ్రు సమస్య ఉన్నవారు వారంలో ఒకసారి ఏవైనా చిట్కాలను పాటించడమో లేదా మెడికేటెడ్ షాంపూతో తలస్నానం చేయడమో.. చేయాలని.. అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారు కండిషనర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. తరచూ తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఏమీ కాదని.. దీని వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు.