బ‌రువు పెరిగేందుకు ఏం చేయాలి ? ఏం ఆహారం తీసుకోవాలి ?

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. బ‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు దాన్ని త‌గ్గించుకునేందుకు య‌త్నిస్తున్నారు. అయితే బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌వారు బ‌రువు పెరిగేందుకు ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయుర్వేదం ద్వారా బ‌రువును ఎలా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

how to gain weight in telugu

అధిక బ‌రువు పెరిగేందుకు నిత్యం ఆహారంలో కొవ్వు ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ల‌కు బ‌దులుగా కొవ్వులు ఎక్కువ‌గా ఉండే నెయ్యి, మాంసం, న‌ట్స్ వంటి ఆహారాల‌ను తినాలి. అయితే వీటి వల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెర‌గ‌కుండా ఉండేందుకు నిత్యం క‌చ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేదంటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువై గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ ప‌దార్థాల‌ను తీసుకునేవారు నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

ఇక అధిక బ‌రువు పెరిగేందుకు అశ్వ‌గంధ చూర్ణం కాకుండా అశ్వ‌గంధ లేహ్యాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే శ‌తావ‌రి అనే మూలిక పొడి, ట్యాబ్లెట్ల‌ను కూడా నిత్యం తీసుకోవ‌చ్చు. వీటిని ఎలా వాడాలో వాటి ప్యాక్‌ల‌పై కంపెనీలు స‌మాచారాన్ని అంద‌జేస్తాయి. క‌నుక ఆ మేర‌కు వాటిని వాడ‌వ‌చ్చు. అలాగే రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించేందుకు అర గంట ముందు ఒక గ్లాస్ వేడి నీటితో 2 త్రిఫ‌ల ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అయితే త్రిఫ‌ల బ‌రువును త‌గ్గిస్తుంది క‌దా ? అని కొంద‌రికి సందేహం వ‌స్తుంది. కానీ బ‌రువు త‌గ్గేందుకు ఆ ట్యాబ్లెట్లు పొడిని వేరేగా వాడాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ముందు చెప్పిన విధంగా ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే బ‌రువు పెరుగుతారు.

బ‌రువు పెరిగేందుకు నెయ్యి కూడా ప‌నిచేస్తుంది. కాక‌పోతే దాన్ని నేరుగా తీసుకోకూడ‌దు. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ చ‌క్కెర రెండింటినీ క‌లిపి తీసుకోవాలి. త‌రువాత 30 నిమిషాలు వేచి చూసి బ్రేక్‌ఫాస్ట్ చేయ‌వ‌చ్చు. దీంతోపాటు మ‌ధ్యాహ్నం కొంత సేపు నిద్రించాలి.

బ‌రువు పెరిగేందుకు ఆక‌లిని కూడా పెంచుకోవాలి. అందుకు జీల‌క‌ర్ర‌, వాముతోపాటు ఖ‌ర్జూరాలు, అర‌టి పండ్లు, న‌ట్స్‌, తృణ ధాన్యాల‌ను తీసుకోవాలి. దీంతో ఆక‌లి పెరుగుతుంది. ఫ‌లితంగా ఎక్కువ ఆహారం తీసుకుని బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువును పెంచుకోవాలి. అలాగే నిత్యం వ్యాయామం చేయాలి. దీంతో అనుకున్న ఫ‌లితాన్ని సాధించ‌డ‌మే కాక‌, ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

– డాక్ట‌ర్ ప్ర‌జ‌క్త గ‌ణేశ్వ‌డి.

Admin

Recent Posts