అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

బట్టతల ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట..!

బట్టతల ఉంటే అదృష్టమని.. పట్టిందల్లా బంగారమవుతుందని.. వారు చాలా అదృష్టవంతులని.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. నిజంగానే బట్టతల ఉన్నవారు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా నిలుస్తారట. అలాగే వెంట్రుకలు బాగా ఉన్నవారికంటే బట్టతల ఉన్నవారే స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తారట. అవును, నిజమే. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్‌లు బట్టతల ఉన్నవారిపై విడి విడిగా చేపట్టిన పలు అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అవేమిటంటే.. బట్టతల ఉన్నవారే ఇతరుల కన్నా జీవితంలో ఎంతో విజయవంతమైన, విజయాలను సాధించే వ్యక్తులుగా నిలుస్తారట. ఇక తెలివితేటలు, జ్ఞానం కూడా బట్టతల ఉన్నవారికే ఎక్కువగా ఉంటాయట.

bald head people are more intelligent

అలాగే బట్టతల ఉన్నవారే ఎక్కువగా డామినేట్ చేస్తూ కనిపిస్తారట. వారే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారట. ఇక స్త్రీలను ఆకర్షించే విషయంలోనూ వారే ముందుంటారట. ఈ క్రమంలో సైంటిస్టులు 20వేల మందితో ఆ అధ్యయనాలు చేసి మరీ పైన తెలిపిన విషయాలను నిర్దారించారు. అందువల్ల బట్టతల ఉన్నవారు బాధపడాల్సిన అవసరం లేదని, వెంట్రుకలు ఉండే వారి కన్నా.. వారే మిక్కిలి విజయవంతమైన, అదృష్టవంతులైన, దృఢమైన వ్యక్తులుగా ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు..!

Admin

Recent Posts