Cow Milk : ఆవు పాలు తాగితే పొడ‌వు పెరుగుతారా ? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ?

Cow Milk : సాధార‌ణంగా చాలా మంది ఆవు పాలు లేదా గేదె పాలు.. ఈ రెండింటిలో ఏదో ఒక పాల‌ను రోజూ వాడుతుంటారు. అయితే రెండూ మ‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వే. కానీ గేదె పాల‌లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. క‌నుక చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి సుల‌భంగా జీర్ణం కావ‌ని.. క‌నుక వారికి ఆవు పాలు ఇవ్వాల‌ని చెబుతుంటారు. అయితే ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌నే విష‌యాన్ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. మ‌రి దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే..

can drinking Cow Milk increases your height what scientists say
Cow Milk

ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌న్న విష‌యం నిజ‌మే. కానీ అది పెద్ద‌ల‌కు వ‌ర్తించ‌దు. చిన్నారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. చిన్నారుల‌కు ఆవు పాల‌ను తాగిస్తే స‌గటున ఇత‌ర పిల్ల‌ల క‌న్నా.. అంటే ఆవు పాల‌ని తాగ‌ని పిల్ల‌ల క‌న్నా.. 0.2 సెంటీమీట‌ర్ల ఎత్తు ఎక్కువ‌గా ఉన్నార‌ని గతంలోనే సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక చిన్నారుల‌కు ఆ వ‌య‌స్సు నుంచే ఆవు పాల‌ను తాగించాలి. దీంతో ఇత‌ర పిల్ల‌లతో పోల్చితే వారు కొంచెం ఎత్తు ఎక్కువ‌గా ఉంటార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ పెద్ద‌ల‌కు మాత్రం ఇది వ‌ర్తించ‌దు.

ఆవు పాల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో పెరుగుద‌ల సరిగ్గా ఉంటుంద‌ని కెన‌డాకు చెందిన సెయింట్ మైకేల్ హాస్పిట‌ల్ సైంటిస్టులు చెబుతున్నారు. వారిలో పెరుగుదల లోపం ఏర్ప‌డ‌ద‌ని.. వ‌య‌స్సుకు త‌గిన ఎత్తు పెరుగుతార‌ని అంటున్నారు. కానీ పెద్ద‌లు ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెర‌గ‌రు. కాక‌పోతే అధిక బ‌రువు ఉన్న‌వారికి, గుండె జ‌బ్బులతో బాధ‌ప‌డుతున్న వారికి.. పాల‌ను స‌రిగ్గా జీర్ణం చేసుకోలేని వారికి.. ఆవు పాలు మంచివ‌ని.. అలాంటి వారు రోజూ ఆవు పాల‌ను తాగ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. అంతేకానీ.. పెద్ద‌లు ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెర‌గ‌ర‌ని.. 18 నుంచి 20 ఏళ్లు వ‌చ్చాక పెరుగుద‌ల ఆగిపోతుంద‌ని చెబుతున్నారు.

Share
Admin

Recent Posts