అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

బీర్ ను అప్పుడ‌ప్పుడు ఒక గ్లాస్ తాగితే మంచిదేన‌ట‌..!

అప్పుడ‌ప్పుడు ఒకటి లేదా రెండు గ్లాసుల బీరు తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదని తాజాగా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వీరు చేసిన పరిశోధనలో బీరు తాగిన వారి గుండె పోటు రిస్కు 31 శాతం తగ్గినట్లు తేలింది. పరిశోధనలో సుమారు రెండు లక్షలమంది బీరు తాగే వ్యక్తుల అలవాట్లను స్టడీ చేశారు.

బీరు ఎందుకు మంచిదంటే, బీరులో సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా వుంటాయట. రక్తనాళాలు గట్టిపడకుండా చేస్తాయట. అది కొవ్వు, ఫైబర్ లేకుండా వుండి కొద్దిపాటి ప్రొటీన్లు కలిగివుంటుందని అంతేకాక, దీనిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటివి కూడా వుండి రక్తంలోని గుండె వ్యాధులకు కారణమైన హోమోసిస్టీన్ లెవెల్ ను తగ్గిస్తాయని కార్డియాలజిస్టు డా. హస్ ముఖ్ రావత్ చెపుతున్నారు.

drinking beer frequently is healthy to heart

అయితే, అలాగని బీరు తాగటం అలవాటు లేనివారిని ఈ విషయంలో ప్రోత్సహించాల్సిన అవసరం లేదని కూడా ఆయన తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియోలజీ చే ఆన్ లైన్ లో ప్రచురించారు.

Admin

Recent Posts