భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి చ్యవన్‌ప్రాశ్‌ను తింటున్నారు. ముఖ్యంగా వృద్దులు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో అనేక ఔషధ విలువలు ఉండే మూలికలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే రోజూ చ్యవన్‌ప్రాశ్‌ను తినడం వల్ల కరోనా రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వారు రీసెర్చి చేసి వెల్లడించారు.
ఢిల్లీలోని చౌదరి బ్రహ్మ ప్రకాష్ ఆయుర్వేద చరక్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు గతేడాది మే నెలలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకని 200 మంది హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కు 2 నెలల పాటు రోజూ చ్యవన్‌ప్రాశ్ తినమని చెప్పారు. వారు రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు గంట ముందు, రాత్రి భోజనం చేశాక 2 గంటల తరువాత చ్యవన్‌ప్రాశ్ తీసుకున్నారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో 12 గ్రాముల చొప్పున వారు ఉదయం, రాత్రి చ్యవన్‌ప్రాశ్‌ను తీసుకున్నారు. ఈ క్రమంలో 2 నెలల అనంతరం కేవలం ఇద్దరికి మాత్రమే కోవిడ్ సోకినట్లు నిర్దారించారు.
అందువల్ల రోజూ చ్యవన్‌ప్రాశ్‌ను తీసుకుంటే కరోనా రాదని చెప్పవచ్చని వారు తెలిపారు. అయితే ఇది కేవలం 2 నెలల పాటు మాత్రమే చేసిన పరిశోధన అని, దీర్ఘకాలం పాటు దీనిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నుంచి మనకు రిస్క్ తగ్గుతుందని తెలిస్తే ఆ సూత్రాన్ని పాటించాలని చెప్పారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ముప్పును చ్యవన్‌ప్రాశ్ తగ్గిస్తుండడం హర్షణీయమన్నారు.
మన దేశంలో చ్యవన్‌ప్రాశ్ ను నిత్యం చాలా మంది తింటారు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి వృద్ధులు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. చిన్నారులకు దీన్ని ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. సీజనల్ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.