మహిళలకు సహజంగానే సంతానం కావాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే పలు కారణాల వల్ల కొందరు సంతానం పొందలేకపోతుంటారు. ఆ కారణాల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒకటి. ఈ సమస్య ఉన్నవారిలో గర్భాశయానికి బయటి పక్క ఓ విధమైన కణజాలం పెరుగుతుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, రుతు సమస్యలు వస్తాయి. రుతు క్రమం సరిగ్గా ఉండదు. దీంతో కొన్నిసార్లు అండాలు పక్వదశకు రాకండానే దెబ్బ తింటాయి. ఈ క్రమంలో సంతానం కలగదు. అయితే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య నుంచి బయటపడాలంటే పలు ఆహార పదార్థాలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడేవారు ద్రాక్ష పండ్లు, వేరు శెనగ, బ్లూబెర్రీ పండ్లను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ మేరకు సౌతాంప్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. ఆయా పదార్థాలలో ఉండే పోషకాలు ఎండోమెట్రియోసిస్ సమస్యను నయం చేస్తాయని వారంటున్నారు. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
ద్రాక్ష పండ్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి1, సి, కె తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పల్లీలలో నియాసిన్ మాంగనీస్‌లు ఉంటాయి. బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ కె, సి, మాంనీస్‌లు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పోషకాలు ఎండోమెట్రియోసిస్ సమస్యను తగ్గిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఆయా పదార్థాలను నిత్యం తీసుకుంటే.. సదరు సమస్య నుంచి బయట పడి మహిళలు సంతానం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.