అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పొగ తాగే వారికి దూరంగా ఉంటే గుండె పోటు రాద‌ట‌..!

పొగతాగే చట్టాలు చేయడం, పొగ నిషేధిత ప్రాంతాలు ఏర్పరచడం, పొగతాగే వారికి దూరంగా వుండటం వంటివి చేస్తే ఆకస్మిక గుండెపోటు మరణాలు, గుండె పోట్లు, తగ్గించవచ్చని తాజాగా ఒక పరిశోధనలో మేయో క్లినిక్ రీసెర్చర్లు వెల్లడించారు. అమెరికాలోని ఆల్మస్టెడ్ కౌంటీ, మిన్, ప్రాంతంలో పొగరహిత చట్టాలను చేసిన తర్వాత గుండెపోట్లు, ఆకస్మిక గుండెపోటు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయని రీసెర్చి వెల్లడించింది.

ఈ అంశాన్నిమేయో క్లినిక్ నికోటైన్ డిపెండెన్స్ సెంటర్ డైరెక్టర్ మరియు రీసెర్చర్ రిచర్డ్ హర్ట్ తన పరిశోధనలో వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధులు లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధులు వున్నవారు, పొగతాగేవారికి దూరంగా వుండాలని తెలిపారు. సాధారణ వ్యక్తులకంటే కూడా వ్యాధులు వున్నవారికి పొగతాగే వారి చుట్టుపక్కల వుండటం ప్రమాదకరం కాగలదని రీసెర్చి తెలుపుతోంది.

keep away from smoking so that you will not get heart attacks

రీసెర్చి మేరకు పొగతాగే చట్టాలు చేసి అమలు చేసిన తర్వాత గుండెపోటు కేసులు, లేదా గుండెపోటు మరణాలు వంటి ప్రమాదాలు సుమారు 45 శాతం వరకు తగ్గాయని రీసెర్చర్లు పేర్కొన్నారు. వీరు చేసిన స్టడీ ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సమావేశాలలో సమర్పించారు.

Admin

Recent Posts