అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

తృణధాన్యాల‌ను రోజూ 100 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే గుండె జ‌బ్బుల ప్ర‌మాదం, న‌డుం చుట్టుకొల‌త‌ త‌గ్గుతాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు స‌ర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకుంటే మధ్య వయస్కుల‌లో నడుము చుట్టు కొల‌త‌, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయ‌ని తేల్చారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జీన్ మేయర్ యూఎస్‌డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్ర‌కారం.. పై వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

take 3 servings of whole grains daily to reduce waist circumference and heart diseases risk

రీఫైన్ చేయ‌బ‌డిన పిండి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతారు. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. కానీ ఫైబ‌ర్ అధికంగా ఉండే తృణ ధాన్యాల‌ను రోజూ తీసుకుంటే ఆయా వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని తేల్చారు. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల న‌డుం చుట్టు కొల‌త త‌గ్గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గాయ‌ని గుర్తించారు. దీంతోపాటు ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గింద‌ని, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరిగింద‌ని తెలిపారు. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు.

గుండె జబ్బుల దీర్ఘకాలిక ప్రమాద కారకాలను అంచనా వేయడానికి 1970లలో ప్రారంభమైన ఫ్రేమింగ్ హామ్ హార్ట్ స్టడీ కోహోర్ట్ నుండి డేటాను సేక‌రించి కొత్త పరిశోధన చేప‌ట్టారు. 3,100 మంది ఇందులో భాగ‌స్వాములు అయ్యారు. వారిలో తృణ ధాన్యాల‌ను త‌క్కువ‌గా తీసుకునే వారిలో న‌డుం చుట్టు కొల‌త పెరిగింద‌ని, హైబీపీ, షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌య్యాయ‌ని గుర్తించారు. అదే రోజూ తృణ ధాన్యాల‌ను తీసుకున్న వారిలో ఆయా స‌మ‌స్య‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని గుర్తించారు.

అందువ‌ల్ల తృణ ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని, భ‌విష్యత్తులో అనారోగ్యాలు రాకుండా ఉండాయ‌ని అంటున్నారు. ఇక పొట్టు తీయ‌ని గోధుమ‌లు, బార్లీతోపాటు బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటివి తృణ ధాన్యాల కింద‌కు చెందుతాయి. వీటిని తీసుకోడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts