కొత్తగా చేసిన రీసెర్చిలో బ్రేక్ ఫాస్టులో కోడి గుడ్డు తింటే కేలరీలు తగ్గించడమే కాదు రోజంతా ఆకలి కూడా నియంత్రించవచ్చని తేలింది. రీసెర్చిలో ఉదయంవేళ బ్రేక్ ఫాస్టులో ప్రొటీన్ ఆధారిత ఆహారం, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారం తింటే ఎలా వుంటుందనేదిగా రెండూ పరిశోధించారు. ప్రొటీన్లు అధికంగా వుండే గుడ్డు ఉదయం తీసుకుంటే రోజంతా ఆకలి నియంత్రించుకోవచ్చని, అంతేకాక ఉదయం బ్రేక్ ఫాస్టులో తీసుకునే ఆహారంలో అధిక కేలరీలు లేకుండా చేసుకోవచ్చని ఈ అంశంపై రీసెర్చి చేసిన కనెక్టికట్ విశ్వవిద్యాలయ న్యూట్రిషనల్ సైన్సెస్ ప్రొఫెసర్ మేరియా లూజ్ ఫెర్నాండెజ్ వెల్లడించారు.
ఒక గుడ్డులో 13 అత్యవసర విటమిన్లు, మినరల్స్ వివిధ పరిమాణాలలో వుంటాయని, అధిక నాణ్యతలుకల ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అన్నీ కూడా 70 కేలరీలలో వచ్చేస్తాయని వీరు తెలిపారు.
గుడ్డులో కోలైన్ అనే పదార్ధం శిశువుల బ్రెయిన్ పెరగటానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డు తినే వారిలో 65 శాతం బరువు కూడా తగ్గినట్లు తెలిసింది. ఈ పరిశోధన సుమారు 30 ఏళ్ళ పాటు సాగింది. గుడ్డు ప్రత్యేకంగా మధ్య వయసులో వున్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తుందని సాధారణంగా తినే బ్రెడ్ కంటే కూడా మంచిదని పరిశోధనలో తేల్చారు.