Silver Anklets : పాదాలకు ఎట్టి పరిస్థితిలోనూ వెండి పట్టీలనే ధరించాలి.. ఎందుకంటే..?

Silver Anklets : హిందూ సంప్రదాయాల ప్రకారం స్త్రీలు కొన్ని నగలను ధరించడం ఆచారం సంప్రదాయంగా వస్తోంది. ఇలాంటి వాటిలో పాదాలకు పట్టీలు ధరించడం కూడా ఒకటి. అమ్మాయి పుట్టినప్పటినుంచి పాదాలకు పట్టీలు ధరిస్తుంటుంది. అయితే పాదాలకు కేవలం వెండి పట్టీలను ధరించడాన్ని మాత్రమే మనం చూస్తున్నాం.

Silver Anklets  must wear to feet know the reason

ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల డిజైన్లతో కూడిన పట్టీలు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వెండి పట్టీలకు బదులుగా వారికి నచ్చిన డిజైన్లలో ఉన్న పట్టీలను ధరిస్తున్నారు.

ఇక ఎంతో మంది సంపన్నులు ప్రస్తుత కాలంలో ఏకంగా బంగారు పట్టీలను తయారు చేయించుకుని ధరించడం మనం చూస్తున్నాం. అయితే సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బంగారు పట్టీలను ఎలాంటి పరిస్థితులలో కూడా  ధరించకూడదు. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక బంగారు పట్టీలను పాదాలకు ధరించడం వల్ల సాక్షాత్తూ అమ్మవారిని అవమానపరిచినట్లే అవుతుందని.. పండితులు చెబుతున్నారు.

అందుకోసమే పాదాలకు బంగారు పట్టీలు ధరించకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఇకఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వెండి పట్టీలను పాదాలకు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి మొత్తం బయటకు పోయి మన శరీరం చల్లబడుతుంది.

కానీ బంగారం మాత్రం మన శరీరానికి వేడి కలుగచేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితులలోనూ పాదాలకు వెండి పట్టీలు తప్ప బంగారు పట్టీలు ధరించకూడదని.. ఆధ్యాత్మికంగాను.. ఆరోగ్యపరంగాను.. వెండి పట్టీలు శుభప్రదమని.. పండితులు తెలియజేస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts