ఇలాంటి వారి వింత కథ.. చివరికి జోకర్ అయ్యాడు.. జెంటిల్ మెన్ గేమ్ లో జంగ్లీ పనులు చేస్తే అసహ్యంగా ఉంటుంది.. అది భారత క్రికెటర్ అయినా సరే హద్దు దాటి ప్రవర్తించకూడదు..
1996 ప్రపంచ కప్ సమయంలో భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కి పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఆమీర్ సోహైల్ బౌండరీ కొట్టి ఆ వెంటనే బోండరీ లైన్ చూపాడు, అక్కడ ఫీల్డర్ ని పెట్టుకో ఇంకో బౌండరీ కొడతాను అన్నట్టు.. ఆ తర్వాత బాల్ కు ఆమీర్ సోహైల్ ని క్లీన్ బౌల్డ్ చేసి పెవీలియన్ దారి చూపాడు వెంకటేష్ ప్రసాద్.. మ్యాచ్ భారత్ గెలిచింది.. అప్పటివరకు పాకిస్థాన్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అందరు భావించారు.. సోహైల్ ఓవర్ యాక్షన్ మూలాన భారత్ ఆటగాళ్లకు ఎక్కడో రోషం పుట్టుకొచ్చి పాకిస్థాన్ ని చిత్తు చేశారు.
నిజానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు ఇది షరా మామూలే.. గ్రౌండ్ పై ఆట కంటే ఇతర అంశాల పై ఎక్కువ దృష్టి పెడతారు.. తమ మత విశ్వాసాన్ని కృత్రిమంగా షో చేయడం, అవసరం లేకున్నా ఆటిట్యూడ్ ప్రదర్శించడం, క్రమశిక్షణ లేకపోవడం, సొంత టీం లోనే ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం, ఇదంతా కేవలం భారతీయులకే కాదు ఇతర దేశస్థులకైనా పాకిస్తాన్ టీం అంటే ఒక రకమైన అసహ్యం కలిగేలా చేసింది. పాకిస్థాన్ ప్లేయర్లకు స్పోర్టివ్ గా ఉండడం సాధ్యం కాని పని, వాళ్ల దేశంలో పాఠశాల వయసు నుండే నీతి నియమాల కంటే ఛాందసవాదాన్ని నూరిపోయడం మూలాన వాళ్ల ప్రవర్తన ఆవిధంగా తయారైంది.