తమ స్తనాలు పెద్దవిగా, అందంగా, ఆకర్షణీయంగా వుండాలని మహిళలు కోరుకుంటుంటారు. కాని వాటికి మార్గం సర్జరీ మాత్రమే అని కూడా భావిస్తారు. సహజంగా పెంచుకునే మార్గాలు కూడా వున్నాయి. అందంగా ఆకర్షణీయంగా కూడా సహజరీతిలో సైజు పెంచవచ్చు. కొన్ని వ్యాయామాలు స్తనాలను పెద్దవి చేయటమే కాదు మంచి బిగువును కూడా కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం…. పెద్దవి అవ్వాలంటే స్తనాలపై ఒత్తిడి కలిగించటం మంచి సహజ వ్యాయామం. బోర్లా పడుకోండి నేలకు లేదా మేట్రస్ కు ఒత్తి ఒత్తిడి కలిగించండి. లేదా నిలబడి గోడకు ఆనించి స్తనాలకు ఒత్తిడి కలిగించండి. మరీ గట్టిగా చేయవద్దు. రిలాక్స్ అవండి. ఈ వ్యాయామాన్ని 10 సార్లు చేయండి.
పుష్ అప్ లు తీయటం మరో వ్యాయామం. మొదట 10 పుష్ అప్ లతో మొదలు పెట్టి మెల్లగా 15 నుండి 25 సార్లు చేయండి. మొదట్లో చేతులు, భుజం నొప్పి పెడతాయి. మరో బ్రెస్ట్ వ్యాయామంగా, తిన్నగా నిలబడండి. చేతులు పిరుదులపై పెట్టండి. ఎడమ మోచేయి కుడిచేతితోను, కుడి మోచేయి ఎడమ చేతితోను వెనుకనుండి అందుకోండి. మెల్లగా చేస్తూ కండరాలు సాగటాన్ని గమనించండి. దీనిని 10 లేదా 15 సెకండ్లలో చేస్తూ కనీసం 10 సార్లు చేయాలి.
బస్ట్ సైజ్ పెరగాలంటే స్విమ్మింగ్ ఎంతో ప్రయోజనం. స్విమ్మింగ్ కుదరకపోతే, ఇంట్లోనే స్విమ్మింగ్ కదలికలు చేయండి. ఈ వ్యాయామాన్ని కనీసం 10 నుండి 20 నిమిషాలు చేయాలి. ఛాతీ ముందుకు మీ అరచేతులు కలపండి. వాటిని గట్టిగా అదిమి పెట్టి 10 సెకండ్లు వుండండి. ఈ వ్యాయామాన్ని 10 సార్లు చేయాలి. రెండు 5 కెజిల రాళ్లు తీసుకోండి. నేలపై వెల్లకిలా పడుకొని ఒక్కోక్క చేతిలో ఒకో రాయి పట్టుకొని వర్టికల్ గా పైకి ఎత్తండి. సాధారణమైన ఈ బస్ట్ వ్యాయామాలు మహిళలు చేసి తమ స్తన సౌందర్యాన్ని సహజరీతిలో అధికం చేసుకొని ఫిట్ గాను, అందంగాను వుండవచ్చు.