స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ తగ్గుతుందంటే ఎవరైనా ఏం చేస్తారు..? ఏముందీ… అలాంటి స్థితిలో ఎవరైనా చార్జింగ్ పెడతారు. వెంటనే వీలు కాకపోయినా కొంత సేపటికి అయినా చార్జింగ్ పెడతారు. దీంతో ఫోన్ చార్జింగ్ అవుతుంది. అయితే అది కరెక్టే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అయిపోయే వరకు వాడుతారు. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌కు చార్జింగ్ పెట్టి పడుకుంటారు. తెల్లవారే వరకు అలాగే ఫోన్‌ను చార్జింగ్‌లోనే ఉంచుతారు. అయితే ఫోన్ 100 శాతం చార్జింగ్ ఎప్పుడో పూర్తవుతుంది. కానీ చార్జింగ్ పెట్టే ఉంచడం వల్ల దానికి ఇక ఇన్‌కమింగ్ వస్తున్న కరెంట్‌ను ఎటు పంపాలో తెలియదు.
దీంతో ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు ఫోన్లు ఏవైనా ఏమవుతాయి..? బ‌్యాటరీ పేలడం వల్ల అవి కూడా పేలుతాయి. ఈ క్రమంలో అలా ఫోన్లను రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉంచి బ్యాటరీ పేలడం వల్ల ప్రాణాల మీదకు వచ్చిన వారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే అన్ని ఫోన్లు అలా కావు. కేవలం కొన్ని ఫోన్లు మాత్రమే అలా అవుతాయి. ఎందుకంటే.. ఒకప్పుడు కొత్తగా సెల్‌ఫోన్లు వచ్చినప్పుడు వాటిల్లో నికెల్ బ్యాటరీలను వాడేవారు. ఇప్పుడంటే ఫోన్ బ్యాటరీలన్నీ లిథియంతోనే తయారై వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఫోన్ బ్యాటరీల్లో నికెల్ ఉండేది. అయితే వీటి వల్ల ఒక సమస్య వచ్చేది అదేమిటంటే..
నికెల్ బ్యాటరీ ఉన్న ఫోన్లను ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 100 శాతం చార్జింగ్ పెట్టాల్సిందే. లేదని తక్కువ చార్జింగ్‌కే తీసేస్తే అవి ఆ చార్జింగ్ కెపాసిటీకే ఫిక్స్ అవుతాయి. అందుకనే నికెల్ బ్యాటరీలను ఇప్పుడు వాడడం లేదు. వాటి స్థానంలో లిథియం బ్యాటరీలు వచ్చాయి. అయితే వీటిలో ఇప్పుడు క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్లు ఉంటున్నాయి. అందువల్ల వీటిని త్వరగా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ బ్యాటరీలు నికెల్ బ్యాటరీల కన్నా ఎక్కువ లైఫ్‌ను ఇస్తాయి. అయితే లిథియం బ్యాటరీలను పరిమితికి మించి అంటే 100 శాతం అయినా చార్జింగ్ పెడితే అప్పుడవి పేలుతాయి. చాలా వరకు ఫోన్లు ఇలా పేలేవే.
కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్ల వల్ల ఇలా బ్యాటరీలు పేలే బాధ తప్పింది. అయినప్పటికీ అవి పేలవని చెప్పలేం. కాకపోతే అవి పేలేందుకు తక్కువ అవకాశం ఉంటుందట. అయినా ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్లను రాత్రంతా చార్జింగ్ పెట్టరాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. ఫోన్ బ్యాటరీ లైఫ్ తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలో పవర్ ఉందీ, లేనిదీ సరిగ్గా తెలియదు. డివైస్‌లో 100 శాతం అని చూపుతుంది. కానీ ఒక్కోసారి వెంటనే చార్జింగ్ అయిపోనట్టు చూపిస్తుంది. అంటే అలాంటి బ్యాటరీలు కాలిబ్రేషన్ ఎర్రర్‌కు లోనైనట్టు తెలుసుకోవాలి.
అలాంటప్పుడు ఫోన్ పూర్తిగా డిశ్చార్జి అయ్యేంత వరకు ఉంచి అది ఆఫ్ అయ్యాక చార్జింగ్ పెట్టాలి. 100 శాతం చార్జింగ్ అయ్యే వరకు ఫోన్‌ను ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్లు ఉన్నప్పటికీ రాత్రంతా డివైస్‌ను చార్జింగ్‌లో పెట్టి ఉంచితే అప్పుడు డివైస్ బాగా హీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవి పేలేందుకు అవకాశం ఉంటుంది. అలా పేలకపోయినా డివైస్ చాలా సేపు హీట్ అవుతుంది. అందువల్ల దాని పనితనంలో మార్పు వస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ త్వరగా పాడవుతుంది.
ఇక రోజంతా రెండు, మూడు సార్లకు మించి చార్జింగ్ పెట్టే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే డివైస్ లో 40 నుంచి 80 శాతం బ్యాటరీ ఉండేలా చూసుకుని వాడాలి. 40కు తగ్గితేనే చార్జింగ్ పెట్టాలి. అలా కాకుండా చీటికీ మాటికీ చార్జింగ్ పెడితే దాని వల్ల బ్యాటరీ లైఫ్ తక్కువవుతుంది. త్వరగా పాడవుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చేలా చూసుకోవచ్చు.