Arjuna Tree Bark : వీర్యం బాగా త‌యార‌య్యేందుకు.. దీన్ని రోజూ తీసుకోవాలి..!

Arjuna Tree Bark : అర్జున వృక్షం (తెల్లమద్ది). భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. గుండెజబ్బులు, ఆస్త‌మా ఉన్న‌వారికి, ఎముక‌లు విరిగిన వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. దీని బెర‌డులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ దీన్ని వాడుతారు.

arjuna chettu beradu powder uses in telugu Arjuna Tree Bark

* అర్జున వృక్షం బెర‌డును పాల‌లో వేసి బాగా మ‌రిగించి డికాష‌న్ కాయాలి. దాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగుతుండాలి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.

* అర్జున వృక్షం బెరడును మెత్త‌గా నూరి చూర్ణంగా మార్చుకోవాలి. దాన్ని పాయ‌సంలో క‌లిపి తీసుకుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది. చ‌లికాలంలో స‌హ‌జంగానే ఆస్త‌మాతోపాటు ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. అలాంటి వారు అర్జున చెట్టు బెర‌డు చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజూ పాల‌లో క‌లిపి రాత్రి పూట ప‌డుకునే ముందు తాగాలి. దీంతో జ‌లుబు కూడా త‌గ్గుతుంది. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

* అర్జున బెర‌డును చూర్ణంగా చేసి దాన్ని తేనెతో కలిపి ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

* అర్జున బెర‌డు చూర్ణాన్ని తేనెతో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై మొటిమ‌లు ఉన్న చోట రాయాలి. నిత్యం ఇలా చేస్తే మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. ముఖం మృదువుగా క‌నిపిస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు.

* అర్జున బెరడును కషాయంగా చేసుకుని తాగుతుంటే కాలినగాయాలు, పుండ్లు తగ్గుతాయి.

* అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. సంతానం క‌లిగేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు పోతాయి. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. వీర్య క‌ణాల నాణ్య‌త పెరుగుతుంది.

* అర్జున చెట్టు బెరడును నూరి గంధంలా తీయాలి. దాన్ని గడ్డ ఉన్న చోట రాసి పైన క‌ట్టు క‌ట్టాలి. దీంతో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బ‌ల‌పై రాస్తున్నా కూడా అవి త‌గ్గిపోతాయి.

Share
Admin

Recent Posts