Garuga Kayalu : మనకు ప్రకృతి అనేక పండ్లను కాలానుగుణంగా అందిస్తూ ఉంటుంది. వాటిలో గరుగ కాయలు కూడా ఒకటి. ఈ కాయలు మనకు గరుగ చెట్టు నుండి లభిస్తాయి. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తాయి. ఈ కాయలను తినడం వల్ల మనం వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ కాయలు చూడడానికి చిన్న ఉసిరికాయల మాదిరి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పెరుగుతాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే వారు వీటిని అడవుల నుండి సేకరించి పట్టణాలకు తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా అడవులల్లో తిరిగే వారు ఈ కాయలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ నీటిని మింగుతూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల దాహం వేయకుండా ఉండడంతో పాటు శక్తిని కూడా కోల్పోకుండా ఉంటారు. అలాగే ఈ కాయలను చప్పరిస్తూ నడవడం వల్ల ఎంత దూరం నడిచినప్పటికి కాళ్ల నొప్పులు రాకుండా కూడా ఉంటాయట. అదే విధంగా గరుగ కాయల చెట్టు దగ్గర చక్కటి సువాసన వస్తూ ఉంటుంది. ఈ చెట్టు గాలిని పీలిస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఈ చెట్టు గాలిని పీల్చడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఈ గరుగ కాయలు వగరుగా ఉంటాయి. అలాగే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ కాయలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఈ కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాయలను మజ్జిగలో ఊరవేసుకుని తింటూ ఉంటారు. అలాగే నిమ్మకాయ పచ్చడిలో వేసుకుని తింటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ లబారిన పడకుండా ఉండవచ్చు. అదే విధంగా గరుగ కాయలను తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఈ కాయలను తినడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
మెదడు చురుకుగా పని చేస్తుంది.జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు రాకుండా ఉంటుంది. అదే విధంగా ఈ గరుగ కాయలను తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యలతో బాధపడే వారు ఈ గరుగ కాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ కాయలను పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. ఈ విధంగా గురగ కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి లభించే కాలాంలో వీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.