మన చుట్టూ అందుబాటులో ఉన్న అనేక రకాల వృక్షాల్లో పారిజాత వృక్షం కూడా ఒకటి. దీని పువ్వులు, ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ వృక్షం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పారిజాత వృక్షం ఆకులు, పువ్వులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పారిజాత వృక్షం ఆకులు, బెరడు అనేక జ్వరాలను తగ్గిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అవి ప్లేట్‌లెట్లను పెంచుతాయి. దీంతో జ్వరాల నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ వృక్షం ఆకులు, బెరడులో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. అవి బాయోటిక్‌లా పనిచేస్తాయి. జ్వరాన్నితగ్గిస్తాయి. పారిజాత వృక్షం ఆకులను నలిపి పేస్ట్‌లా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని 2 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు ఒక కప్పు అయ్యే వరకు మరిగించాక ఆ నీటిని తాగాలి. దీంతో జ్వరం తగ్గుతుంది. రోజుకు ఇలా 2 సార్లు తాగవచ్చు.
2. పారిజాత వృక్షం ఆకులు, పువ్వుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. పారిజాత ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు ఒక్కసారి తాగుతుండాలి. ఆర్థరైటిస్ నొప్పులు, సయాటికా నొప్పులు తగ్గుతాయి. ఆయా సమస్యలకు ఆ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.
3. ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో 2-3 పారిజాత ఆకులు, పువ్వులు వేసి మరిగించాలి. అనంతరం తయారయ్యే నీటిని తాగాలి. దీంతో దగ్గు, జలుబు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యలు వెంటనే తగ్గుతాయి. అవసరం అయితే ఆ నీటిలో అల్లం రసం, తేనె కలిపి కూడా తాగవచ్చు.
4. పారిజాత నూనె మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఇందులో యాంటీ అలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉటంఆయి. అందువల్ల ఇ.కొలి, ఫంగస్, ఇతర బాక్టీరియాలు నశిస్తాయి. ఆయా ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు చర్మంపై ఆ నూనెను రాస్తుంటే ఫలితం ఉంటుంది.
5. పారిజాత పువ్వులు, ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 10 పారిజాత ఆకులు, 10 పువ్వులను తీసుకుని గ్రైండ్ చేసి పేస్ట్‌లా పట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ నీటిని పోయాలి. ఆ మిశ్రమాన్ని మరిగించాలి. మిశ్రమం సగం అయ్యే వరకు మరిగించాక వడకట్టి దాన్ని 3 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని ఒక పూట సేవించాలి. మొత్తం 3 భాగాలను 3 పూటలా తీసుకోవాలి. భోజనానికి 1 గంట ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు.
6. పారిజాత పువ్వులను నీటిలో మరిగించి ఆ నీటిని రోజూ కప్పు మోతాదులో ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
7. పారిజాత పువ్వులను సేకరించి మిశ్రమంగా చేసి దాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే చాలు, శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.
8. పారిజాత ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగుతుంటే మలబద్దకం ఉండదు. ఆందోళన, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
9. పారిజాత ఆకులతో దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన తగ్గుతుంది.
10. పారిజాత ఆకుల కషాయాన్ని తాగుతుండడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వికారం, హైపర్ అసిడిటీ సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థలో ఉండే పురుగులు నశిస్తాయి.