House Main Door : ప్రతి ఒక్కరు కూడా, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఏమైనా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది ఇళ్లల్లో, అనేక సమస్యలు కలిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. కష్టాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. తలపెట్టిన పనులు కూడా పూర్తవ్వవు. పనులు ఆగిపోతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అయితే, ఇటువంటి బాధల నుండి బయట పడాలంటే, ఇంట్లో ఒక చోట, ఒక గిన్నెలో నీటిని ఉంచండి.
ఇక అద్భుతమైన లాభాన్ని మీరు పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, నీళ్లు సానుకూలతను సూచిస్తుంది. నీటిని ఒక గిన్నెలో పోసి, అందులో కొన్ని పూలను వేసి, ఇంట్లో పెట్టడం వలన, చక్కటి ఉపయోగం ఉంటుంది. ఇంటికి వచ్చే వ్యక్తులు, అతిథిల దృష్టి పడేలా, నీటితో నింపిన గిన్నె ని పెట్టాలి. గుండ్రని గిన్నెలో నీటిని నింపి, అందులో కొన్ని పూలు, ఆకులు వేసి, హాల్లో కూడా పెట్టుకోవచ్చు.
దీని వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. హాలు మధ్యలో కానీ ఆగ్నేయవైపు కానీ ఈశాన్యం, ఉత్తర దిశల్లో పెట్టుకోవచ్చు. నైరుతి వైపు కూడా పెట్టుకో వచ్చు. పసుపు రంగు పూలు, ఆకుపచ్చ రంగు పూలు నీళ్లలో వేస్తే మంచిది. బంగారం లేదంటే ఏదైనా లోహంతో తయారు చేసిన, గిన్నెని వాడొచ్చు.
వెండి, ఇనుము, అల్యూమినియం మాత్రం వాడొద్దు. ఇత్తడి కి నెగిటివ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. నీరు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడాలంటే, ఇత్తడి గిన్నెలో నీళ్లు పోసి, హాలు మధ్యలో ఉంచితే మంచిది. హాలులో వాటర్ బౌల్ పెట్టడం వలన, సంతోషం కూడా పెరుగుతుంది.