Black Dog : మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మనం వెళ్లే పని అవుతుందా లేదా అనేది శకునం ద్వారా మనకి తెలిసిపోతుంది. అప్పుడప్పుడు జాతకాలు వంటివి తప్పు అవచ్చు ఏమో కానీ శకునాల మాత్రం ఎంతో కరెక్టుగా ఉంటాయి. అందులో తప్పు ఉండదు శకునం బట్టి మనం వెళ్లే పని అవుతుందా లేదా అనేది చెప్పవచ్చు. పూర్వం నుండి కూడా ఈ శకునాలకి ప్రాముఖ్యత చాలా ఉంది అయితే అప్పుడప్పుడు మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మనకి కుక్కలు పిల్లులు వంటిది కూడా ఎదురవుతూ ఉంటాయి. కుక్క ఎదురైతే ఎలాంటి ఫలితాలని పొందొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.
నల్ల కుక్క కనుక మనకి ఎదురు వస్తే ధన లాభం కలుగుతుంది. కుక్క ఏదైనా ఆహారాన్ని పట్టుకుని ఎదురు వచ్చిందంటే వెళ్లే పని పూర్తవుతుంది. ధనలాభం కలుగుతుంది. కుక్క ఏదైనా ఎత్తైన ప్రదేశం లో కూర్చుని కుడికాలితో గోక్కుంటున్నట్లయితే కూడా కార్యసిద్ధి కలుగుతుంది. మాంసం ముక్క పట్టుకున్న కుక్క కనుక ఎదురైతే ఖచ్చితంగా ఆ వ్యక్తికి కష్టం కలగబోతోందని దానికి సంకేతం.
కుక్కలకి ఆహారం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది ముఖ్యంగా నల్ల కుక్కలకి ఆహారం పెడితే శనీశ్వరుడు ప్రసన్నమవుతారు. ఆహారం తిన్న తర్వాత కుక్క కుడి కాలని ఎడంకాలితో గోక్కుంటే ఎంతో శుభం కలుగుతుంది. మంచి జరుగుతుంది. కుక్క చెప్పులను తెచ్చి విడిచిపెట్టినట్లయితే కూడా మనకి మంచి జరగబోతోంది అని సంకేతం.
కుక్క వచ్చి అరుస్తూ ఉంటే ధన ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నల్ల కుక్క ఎదురైతే మాత్రం చాలా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు.అనుకున్న పనిలు అవుతాయి ధన ప్రాప్తి కలుగుతుంది ఇబ్బందులు ఏమీ లేకుండా తిరిగి మనం ఇంటికి వస్తాము.